twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'నేను చేసింది నైతికంగా పొరపాటే'....: 'ఎ ఉమన్‌ ఇన్‌ బ్రాహ్మణిజం' దర్శకుడు

    By Srikanya
    |

    హైదరాబాద్‌: తాను చేసింది నై తికంగా పొరపాటేనంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు 'ఎ ఉమన్‌ ఇన్‌ బ్రాహ్మణిజం' చిత్ర దర్శక నిర్మాత పూరి గంగాధర్‌ . చిత్రాన్ని నిషేధించాలని ఒక వర్గం తీవ్రంగా పట్టుబడుతున్న విషయాన్ని ప్రస్తావించగా అందుకు తనను తాను సవరించుకున్నట్లు చెప్పారు. అయితే సినిమా చూసిన ప్రేక్షకులు చెమ్మగిల్లిన కళ్లతో బైటకు వస్తారని, కథలో అంత బలం ఉందని అన్నారు. 'ఎ ఉమన్‌ ఇన్‌ బ్రాహ్మణిజం' చిత్రం విడుదల కాకముందే వివాదాస్పదంగా మారి వార్తలకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిత్ర దర్శక నిర్మాత తోపూరి గంగాధర్‌ ఓ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తో మాట్లాడారు.

    అలాగే తనను మొదటి నుంచి శ్రీశ్రీ, చలం రచనలు తనను ప్రభావితం చేశాయని, చలం రాసిన బ్రాహ్మణీకం నవలను చిత్రంగా తీయాలని నిర్ణయించుకున్నానని గంగాధర్‌ చెప్పారు. సినిమా ట్రైలర్స్‌పై విమర్శలు రావటంతో యుట్యూబ్‌ సైట్‌ నుంచి వాటిని తొలగించానన్నారు. చిత్రం వివాదాస్పదమైనపుడు ముంబయి సెన్సార్‌ బోర్డు వద్దకు అక్టోబర్‌ 30న వెళ్లి 2.40 నిమిషాల కోతలను ప్రతిపాదించానని, మొత్తం చిత్రంనుంచి బ్రాహ్మణ పదం తొలగించానని చెప్పారు. చిత్రం టైటిల్‌లో కూడా బ్రాహ్మణ శబ్దాన్ని తొలగించామంటూ బోర్డు స్పందన కోసం ఎదురు చూస్తున్నామని ఈ దర్శక నిర్మాత వెల్లడించారు.

    ఇక చలంకు వివాదాస్పద రచయిత అని పేరుంది. మరి అలాటి రచయిత రచనలను సినిమాగా ఎందుకు తీశారని ప్రశ్నించగా బ్రాహ్మణీకం నవల వివాదాస్పదమని తాను భావించలేదన్నారు గంగాధర్‌. తాను ప్రతిపాదించిన కోతలు ఆమోదం పొందితే చిత్రం విడుదలకు ఎవరి అభ్యంతరం ఉండబోదని అనుకుంటున్నానన్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 'ఎ ఉమన్‌ ఇన్‌ బ్రాహ్మణిజం' ను ముందుగా హిందీలో నిర్మించారు. తర్వాత వివిధ భారతీయ భాషలలోనికి డబ్‌ చేసేందుకు నిర్ణయించారు.

    అన్ని భాషా చిత్రాలను ఒకే పర్యాయం విడుదల చేస్తారు. కాని విస్తృతంగా విమర్శలు రావటంతో ముంబయి సెన్సార్‌ బోర్డు సెన్సార్‌ చేసింది. రాష్ట్రప్రభుత్వం కూడా ఇందులో అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయా లేదా అనేది నిర్ధారించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ద్రోణంరాజు సత్యనారాయణ, ఉండవల్లి అరుణ్‌ కుమార్‌, డి. శ్రీధరబాబు లాంటి ప్రముఖులు ఈ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.ఈ సినిమా చిత్రీకరణ అభ్యంతరకరంగా ఉందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. చిత్రం తాలూకు ట్రైలర్స్‌ను యుట్యూబ్‌ సైట్‌లో పెట్టటంతో దేశవ్యాప్తంగా బ్రాహ్మణ సమాజం నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇందుకు చిత్ర నిర్మాత గంగాధర్‌ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

    English summary
    "I did something morally wrong and I repent it. I have corrected it myself. I can assure that those who watch the movie will leave the theatres with tears rolling down their cheeks. The plot is that powerful"...says film’s “A Woman in Brahmanism” producer and directer Topuri Gangadhar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X