For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ట్విట్టర్ రివ్యూ: సుధీర్ మూవీకి అలాంటి టాక్.. అదే పెద్ద మైనస్ అంటూ!

  |

  సూపర్ స్టార్ మహేశ్ బాబు బావగా సినిమాల్లోకి ప్రవేశించాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు. కెరీర్ ఆరంభంలోనే మంచి మంచి చిత్రాలతో మెప్పించిన అతడు.. స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ, ఈ మధ్య కాలంలో హిట్ మాత్రం దక్కడం లేదనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సుధీర్ బాబు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చింది? దీనిపై ట్విట్టర్‌లో నెటిజన్లు ఎలాంటి పోస్టులు పెడుతున్నారు? అనే విషయాలను చూద్దాం పదండి!

  ఆ అమ్మాయి గురించి చెప్పాలని

  ఆ అమ్మాయి గురించి చెప్పాలని

  సుధీర్ బాబు నటించిన తాజా చిత్రమే 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కించిన ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై మహేంద్రబాబు, కిరణ్ నిర్మించారు. దీనికి వివేక్ సాగర్ సంగీతం అందించాడు. అవసరాల శ్రీనివాస్ ఇందులో కీలక పాత్రను పోషించాడు.

  డెలివరీ తర్వాత తొలిసారి బికినీలో ప్రణిత: మరీ ఇంత దారుణంగా చూపిస్తారా!

  అలాంటి స్టోరీతో వచ్చిన సినిమా

  అలాంటి స్టోరీతో వచ్చిన సినిమా

  కెరీర్ ఆరంభం నుంచి తనదైన చిత్రాలను చేస్తూ ప్రేక్షకులను తన వైపునకు తిప్పుకున్న సుధీర్ బాబు.. ఇప్పుడు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం లవ్ స్టోరీకి సంక్లిష్టమైన పాయింట్‌ను జోడించి తెరకెక్కించారని తెలిసింది. ఇది ఆద్యంతం లవ్ అండ్ ఎమోషనల్‌ సీన్స్‌తో సాగేలా తెరకెక్కించినట్లు ముందే చెప్పారు.

  అంచనాలకు తగ్గట్లుగా బిజినెస్

  అంచనాలకు తగ్గట్లుగా బిజినెస్

  సరికొత్త పాయింట్‌తో రూపొందిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా ప్రమోషన్ సరికొత్తగా సాగింది. అందుకే దీని నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీ బిజినెస్ మంచిగా జరిగింది. అంతేకాదు, ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

  Bigg Boss Telugu 6: షోలో గీతూ ఊహించని పని.. అందరి ముందే బట్టలు విప్పేసి మరీ!

  సుధీర్ సినిమాకు అలాంటి టాక్

  సుధీర్ సినిమాకు అలాంటి టాక్

  సుధీర్ బాబు - కృతి శెట్టి జంటగా నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీ ఓ అమ్మాయి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ వచ్చిన రిపోర్టుల ప్రకారం.. ఈ సినిమాకు అన్ని చోట్ల మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కొందరు బాగుందని, మరికొందరు యావరేజ్ అని అంటున్నారు.

  ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా

  ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా

  'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం పాత్రల పరిచయం చేయడం.. ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడానికే డైరెక్టర్ ఎక్కువ సమయం తీసుకున్నాడట. అయితే, ఇంటర్వెల్ మాత్రం ఆసక్తికరంగా ఉంటుందట. కానీ, సెకెండాఫ్‌లో మాత్రం చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఇక, క్లైమాక్స్ కూడా ఎమోషనల్‌గా సాగుతుందట.

  శృతి మించిన నందినీ హాట్ షో: టాప్ అందాలను ఆరబోస్తూ రచ్చ

  సినిమాలో ప్లస్‌లు.. మైనస్‌ ఇలా

  సినిమాలో ప్లస్‌లు.. మైనస్‌ ఇలా

  'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీని చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. దర్శకుడు ఎంచుకున్న కథ, ఇంటర్వెల్ ట్విస్ట్, సెకెండాఫ్, ఎమోషనల్ సీన్స్, పెయిర్ మధ్య సీన్స్, క్లైమాక్స్ ఈ చిత్రానికి ప్లస్‌ అని తెలిసింది. అయితే, సంగీతం, సినిమా స్లోగా సాగడం, ఫస్టాఫ్, కమర్షియల్ హంగులు లేకపోవడం ఈ చిత్రానికి మైనస్‌గా మారిందని నెటిజన్లు అంటున్నారు.

  ఫైనల్‌గా మూవీ ఎలా ఉందంటే

  ఫైనల్‌గా మూవీ ఎలా ఉందంటే

  ట్విట్టర్ ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీ స్లోగా సాగే ఎమోషనల్‌ డ్రామా అని చెప్పొచ్చు. సంక్లిష్టమైన పాయింట్‌ను ప్రేక్షకులకు చేరువ చేసేందుకు దర్శకుడు చేసిన ప్రయత్నం ఆకట్టుకుంటుందట. ముఖ్యంగా లవ్ అండ్ కాన్సెప్టు మూవీలు, ఎమోషనల్ కంటెంట్‌ను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుందని తెలిసింది.

  బీచ్‌లో బికినీలో రెచ్చిపోయిన శ్రీయ: ఆ పార్టులన్నీ చూపిస్తూ దారుణంగా!

  అసలైందే మైనస్ అయిందని

  అసలైందే మైనస్ అయిందని


  సుధీర్ బాబు - కృతి శెట్టి జంటగా నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీని చూసిన వాళ్లు చెబుతున్న దాని ప్రకారం.. ఈ సినిమాలో ఎమోషనల్ డ్రామా చాలా బాగుంటుందట. అయితే, ఇలాంటి మూవీలకు కావాల్సిన గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, కావాల్సిన స్పీడు మాత్రం ఇందులో కనిపించదని అంటున్నారు. అదొక్కటే ఇందులో మిస్ అయిందని నెటిజన్లు అంటున్నారు.

  English summary
  Sudheer Babu Did Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Under Mohana Krishna Indraganti Direction. Lets See This Movie Twitter Review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X