»   »  ‘అ...ఆ’ పవన్ కళ్యాణ్ ను ఇలా వాడేసారు (వీడియో)

‘అ...ఆ’ పవన్ కళ్యాణ్ ను ఇలా వాడేసారు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం అ..ఆ. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అనే సబ్ టైటిల్ తో రూపొందుతున్న ఈచిత్రం జూన్ 2న విడుదల చేస్తున్నారు.

సమంత బోయ్ ఫ్రెండ్, అఖిల్ ఫ్లాఫ్, పవన్ సర్ఫైజ్..ఇలా అన్నిటి గురించీ నితిన్

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ల జోరు పెంచారు. తాజాగా సినిమాలోని ఎల్లిపోకే శ్యామల సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు. ఇందులో పవన్ కళ్యాణ్ కూడా కనిపించడం గమనార్హం.

 A Aa Movie Yellipoke Shyamala Song Making

గతంలో నితిన్ తన సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ వాడుకుని హిట్లు కొట్టారు. ఈ సినిమాలోనూ వాడుకోవడానికి ట్రై చేసాడు కానీ....కథ పరంగా, స్క్రిప్టు పరంగ అలాంటి అవకాశం లేక పోవడంతో ఇలా మేకింగ్ వీడియోలో పవన్ కళ్యాణ్ ను చూపెట్టి పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనూ సినిమాపై ఆసక్తి పెంచేలా చేస్తున్నాడు.

ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఎటువంటి కట్స్ లేకుండా సినిమా క్లీన్ యు సర్టిఫికెట్ సొంతం చేసుకొంది. త్రివిక్రమ్ నుండి ఫ్యామిలీ ఎంటర్టెనర్ అంటే మంచి హాస్యం మేళవించిన కుటుంబ కథతో సాగుతుంది. 'అ ఆ' ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల నమ్మకాన్ని ఏమేరకు నిలబెడుతుందో చూడాలి.

త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంతనాయికగా తొలిసారిగా నటిస్తున్నారు. మరో కధానాయిక గా ' అనుపమ పరమేశ్వరన్'(మలయాళ చిత్రం 'ప్రేమమ్' ఫేం) నటిస్తున్నారు. చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో .. నదియ,అనన్య,ఈస్వరీరావు,సన, గిరిబాబు, నరేష్,రావురమేష్ ,పోసాని, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు, ప్రవీణ్, శ్రీనివాస రెడ్డి లు నటిస్తున్నారు.

English summary
Watch Yellipoka Shyamala song making from A Aa movie starring Nithin, Samantha, Anupama Parameswaran. Directed by Trivikram Srinivas. Produced by S. Radhakrishna on Haarika & Hassine Creations banner. Music composed by Mickey J Meyer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu