»   »  'ఆడు మగాడ్రా బుజ్జీ' 5 న కాదు..మరి??

'ఆడు మగాడ్రా బుజ్జీ' 5 న కాదు..మరి??

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'ప్రేమకథాచిత్రమ్‌'తో తొలి విజయాన్ని అందుకొన్నారు సుధీర్‌బాబు. ఇప్పుడు 'ఆడు మగాడ్రా బుజ్జీ'లో సిక్స్‌ప్యాక్‌తో ఆకట్టుకోబోతున్నారు. గంగదాసు కృష్ణారెడ్డి దర్శకుడు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈనెల 7 న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మొదట ఈ చిత్రాన్ని ఐదున విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల రెండు రోజులు ముందుకు జరిపారని తెలుస్తోంది.

మహేష్ బాబు సోదరి భర్త...బావ అయిన ఎస్‌ఎమ్‌ఎస్‌ ఫేం సుధీర్‌బాబు, అస్మితా సూద్ జంటగా... రూపొంది విడుదలకు సిద్దంగా ఉన్న చిత్రం 'ఆడు మగాడురా బుజ్జీ‌' . పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో హీరో కుక్కతో మాట్లాడుతూండటం హైలెట్ అని తెలుస్తోంది. ఆ సీన్స్ ఫుల్ కామెడీ పండిస్తాయని,తెలుగు తెరపై ఇలాంటి కామెడీ చూడలేదని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ చిత్రం వచ్చే నెల 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


హీరోయిన్ అస్మితా సూద్ మాట్లాడుతూ.. '' 'ఆడు మగాడ్రా బుజ్జీ' లో నా పాత్ర చిత్రణ నేటి తరం అమ్మాయిలకు ప్రతీకగా ఉంటుంది. ఇందులో సుధీర్‌ ఓ కుక్కతో మాట్లాడుతుంటాడు. అదెందుకనేది సస్పెన్స్‌'' అంటూ సినిమా గురించి చెప్పుకొచ్చింది. నా తొలి సినిమా 'బ్రహ్మిగాడి కథ' తర్వాత నాకు చాలా అవకాశాలొచ్చాయి. అయితే వెంటనే దేన్నీ అంగీకరించలేదు. మంచి పాత్రలు చేయాలనే ఉద్దేశంతోనే ఇన్నాళ్లు ఆగాను. అలా ఆలోచించి చేసిన సినిమానే 'ఆడు మగాడ్రా బుజ్జీ'. మంచి హీరోయిన్ గా నాకు పేరు తెచ్చే సినిమా అవుతుంది'' అన్నారు

కథ గురించి చెప్తూ...కాలేజీలో అందమైన అమ్మాయిని నేను. అయితే నా వైపు చూడటానికి అబ్బాయిలు భయపడుతుంటారు. దానికి కారణం మా అన్నయ్య. అతను కాలేజీలో డాన్‌. అయితే సుధీర్‌ మాత్రం నా కోసమే కాలేజీకొస్తాడు. నన్ను ప్రేమిస్తాడు. అయితే దాని వెనుక మాత్రం పెద్ద కారణముంటుంది. అది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇలాంటి సినిమాలు ఇప్పటికే చాలా వచ్చుంటాయి. వాటిలో ఇది భిన్నంగా ఉంటుంది. ''అన్నారు అస్మిత.

Aadu Magaadu Ra Bujji released date Changed

సుమన్, నరేష్, సంధ్యా జనక్, లక్ష్మి, రణ్‌ధీర్, సాయి, కృష్ణభగవాన్, పృథ్విరాజ్, సుమన్‌శెట్టి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ, కథ: కృష్ణాడ్డి గంగదాసు, లంకపల్లి శ్రీనివాస్, కెమెరా: శాంటోనియో ట్రిజియో, పాటలు: పద్మశ్రీ, నక్కా రామకృష్ణ, పాటలు: అనంతశ్రీరామ్, కృష్ణచైతన్య, చిర్రావూరి విజయ్‌కుమార్, నిర్మాతలు:సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణారెడ్డి గంగదాస్.

English summary
Sudhir Babu, Asmita Sood, Poonam Kaur starrer Aadu magaadu Raa Bujji completing its post production activities. Buzz is plans are on to complete its censor and release the film on Dec 7th. Krishna Reddy Gangadasu is directing the film for which Sri is the music director.SN Reddy and Subba Reddy are jointly producing this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu