twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆగడు: నో టిక్కెట్స్, అంతటా ఔట్ ఆఫ్ స్టాక్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మహేష్ బాబు నటించిన ‘ఆగడు' చిత్రం ఈ నెల 19న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తోంది ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ. సోమవారమే ఆన్ లైన్, అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.

    ఆన్ లైన్ బుకింగ్ మొదలైన కొద్ది నిమిషాల్లోనే ఫస్ట్ డే టికెట్స్ అన్నీ అమ్ముడు పోయాయి. ఇక థియేటర్ల వద్ద ఇచ్చే అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ కూడా ఈ రోజే అయిపోయాయి. దీంతో అన్ని థియేటర్ల వద్ద ఫస్ట్ డే టికెట్స్ అయిపోయాయి అంటూ బోర్డులు పెట్టేసారు. రేపటిలోగా ఫస్ట్ వీకెండ్ (శుక్ర, శని, ఆది) షోలకు సంబంధించిన టికెట్స్ అన్నీ అయిపోతాయని అంచనా.

    భారీగా విడుదల, అడ్వాన్స్ బుకింగ్ కూడా జోరుగా సాగడంతో.....‘ఆగడు' ఫస్ట్ డే ఓపెనింగ్ కలెక్షన్ష్ ఏ రేంజిలో ఉంటాయో? అనే ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో నెలకొంది. అటు అభిమానులు కూడా ‘ఆగడు' క్రియేట్ చేయబో రికార్డుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    Aagadu Advance Booking full Swing

    ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే పెద్దలతో పాటు పిల్లలు కూడా వెళ్లి ఈ సినిమా నిరభ్యరంతంగా చూడొచ్చని అర్థం. ‘ఆగుడు' సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది నిర్మాతలు సినిమా ప్రమోషన్స్ ముమ్మరం చేసారు. మరో వారంలో ‘ఆగడు' విడుదల కానుండటంతో అన్ని థియేటర్లలో...కొత్త థియేట్రికల్ ట్రైలర్ ప్రదర్శిస్తున్నారు.

    ‘ఆగడు' చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ దాదాపు 55 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే సినిమా విడుదల ముందే భారీగా బిజినెస్ జరిగింది. శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇలా అన్నీ కలిపి ఇప్పటికే రూ. 75 కోట్ల వరకు నిర్మాతలకు ముట్టాయని అంటున్నారు.

    ఈచిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్. 'దూకుడు' వంటి భారి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఇది. అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు.

    English summary
    Aagadu Advance Booking full Swing. Superstar Mahesh Babu's highly-anticipated Telugu movie Aagadu, which has been directed by Srinu Vaitla, has completed the formalities of the Regional Censor Board on Friday. The movie has reportedly received a U/A Certificate from the board without any suggestion for delete or mute. The makers have now gone on busy with the preparations for grand release worldwide on September 19.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X