మహేష్ బాబు ‘ఆగడు’ ఆడియో రిలీజ్ ఎప్పుడంటే?

ఈ చిత్రంలో మహేష్ బాబు పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. పోకిరి, దూకుడు తర్వాత పవర్‌ఫుల్ పోలీసు అధికారిగా మహేష్‌బాబు కనిపించబోతున్న చిత్రం 'ఆగడు'. తమన్నా హీరోయిన్. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు.
'ఆగడు' చిత్రం షూటింగ్ ఈ నెల 23 నుంచి బళ్లారిలో తీయటానికి ప్లాన్ చేస్తున్నారు. అక్కడో పాట, కొన్ని కీలకమైన సన్నివేశాలు తీయనున్నారు. 20 రోజుల పాటు అక్కడే షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. మహేష్, శ్రీనువైట్ల కాంబినేషన్‌కి ఎక్కడలేని క్రేజ్‌ని తీసుకొచ్చిన చిత్రం దూకుడు. ఇప్పుడు మళ్లీ వారిద్దరి కలయికలో సినిమా అనగానే... 'ఆగడు'పై అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. తమన్నా తొలిసారి మహేష్‌తో జతకడుతోంది.
దూకుడు'లో తెలంగాణ శ్లాంగ్‌తో అలరించిన ప్రిన్స్.. 'ఆగడు'లో రాయలసీమ యాసలో మెప్పిస్తారని వినికిడి. రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ,సంగీతం: ఎస్.ఎస్.తమన్, ఛాయా గ్రహణం: కె.వి.గుహన్.


Click it and Unblock the Notifications











