»   » మహేష్ ఫ్యాన్స్ క్రియేటివిటీ.. ‘ఆగడు’ ఫ్యాన్ మేడ్ పోస్టర్

మహేష్ ఫ్యాన్స్ క్రియేటివిటీ.. ‘ఆగడు’ ఫ్యాన్ మేడ్ పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'దూకుడు' చిత్రాన్ని అందించిన మహేష్ బాబు-శ్రీను వైట్ల కాంబినేషన్లో తాజాగా 'ఆగడు' చిత్రం తెరకెక్కుతుండటంతో మహేష్ ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. ఇంకా 'ఆగడు' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కాక పోయినా....తమ క్రియేటివిటీ ఉపయోగించి ఫస్ట్ లుక్ డిజైన్స్ తయారు చేసి ఇంటర్నెట్లో వదులూతూ తమ అభిమానం చాటుకుంటున్నారు. తాజగా అభిమానులు విడుదల చేసిన ఆగడు మూవీ ఫస్ట్ లుక్ ఫోటోను ఇక్కడ మీరు చూడొచ్చు. వంశీ అనే అభిమాని ఈ పోస్టర్ క్రియేట్ చేసారు.

గతంలో శ్రీను వైట్ల, మహేష్ బాబు కలిసి 'దూకుడు' చిత్రానికి పని చేసిన సంగతి తెలిసిందే. 'ఆగడు' చిత్రం వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం. 'ఆగడు' చిత్రంలో మహేష్ బాబు పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ శంకర్‌గా మహేష్ బాబును చూడబోతున్నాం. దూకుడులో తెలంగాణ యాసలో అదరగొట్టిన మహేష్ బాబు ఇపుడు రాయలసీమ యాసలో డైలాగులు విసరనున్నాడు.

 Aagadu fan made poster

ప్రస్తుతం బళ్లారి ప్రాంతంలో షూటింగ్ జరుగుతోంది. చిత్రంలో ఎంతో కీలకమైన డస్ట్ సీన్ చిత్రీకరించారు. ఈ సీన్ చిత్రీకరణ ఎంతో చాలెంజింగ్‌గా తీసుకున్న శ్రీను వైట్ల సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసారట. సినిమా యూనిట్ మొత్తం బాగా సహకరించడం వల్లనే ఈ సీన్ ఇంత బాగా పూర్తయిందని అంటున్న శ్రీను వైట్ల మహేష్ బాబుతో పాటు, టీం మొత్తానికి ధన్యవాదాలు తెలిపారు.

రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ,సంగీతం: ఎస్.ఎస్.తమన్, ఛాయా గ్రహణం: కె.వి.గుహన్. ఆగడు మూవీ ఆడియోను సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

English summary
Aagadu fan made poster created by Mahesh Babu fan. Aagadu is an upcoming Telugu film with action and comedy directed by Srinu Vaitla starring Mahesh Babu and Tamannaah in lead roles. The film is second combination for Mahesh Babu and Srinu Vaitla after Dookudu and the first collaboration of Mahesh Babu with Tamannaah.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu