»   »  మహేష్ ‘ఆగడు’ ఫస్ట్ లుక్ కేక....(ఫోటోలు)

మహేష్ ‘ఆగడు’ ఫస్ట్ లుక్ కేక....(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు మే 31ని పురస్కరించుకుని ఆయన తనయుడు మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా 'ఆగడు' ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విడుదల చేసారు. ఈ చిత్రంలో మహేష్ బాబు పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. గతంలో మహేష్ బాబుతో 'దూకుడు' లాంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీను వైట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/o867LVRFe5w?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్. తమన్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'దూకుడు' తర్వాత మహేష్‌, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఫస్ట్ లుక్ ఉండటంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

స్లైడ్ షోలో 'ఆగడు' చిత్రం ఫస్ట్ లుక్ ఫోటోలు, టీజర్...

మహేష్ బాబు

మహేష్ బాబు


మహేష్‌ శైలి వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉండనుంది. శ్రీను వైట్ల సినిమాల్లో ఉండే కామెడీ ఈ చిత్రంలోను ప్రధానంగా ఉండనుంది.

తమన్ సంగీతం

తమన్ సంగీతం


ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. గతంలోనూ మహేష్ చిత్రాలకు సంగీతం అందించిన తమన్ తన రికార్డుని ఈ చిత్రంలో బ్రద్దలు కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడు.

ఎలా ఉండబోతోందో?

ఎలా ఉండబోతోందో?


ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... ‘ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకుని దిగారు శ్రీను వైట్ల. మరి స్క్రిప్టు నైపుణ్యం లేకుండా శ్రీను వైట్ల సొంత స్క్రిప్టు ఎలా ఉండబోతోంది? అనేది ఆసక్తికరంగా మారింది.

వరుసగా అదే సంస్థలో...

14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో ‘దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో ‘1-నేనొక్కడినే' సినిమాకు చేసారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో ‘ఆగడు' సినిమా చేస్తున్నారు.

English summary
Aagadu movie first look posters released. Aagadu is an upcoming Telugu film with action and comedy directed by Srinu Vaitla starring Mahesh Babu and Tamannaah in lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X