»   » మహేష్-శ్రీనువైట్ల ‘ఆగడు’కు దూకుడుతో లింక్?

మహేష్-శ్రీనువైట్ల ‘ఆగడు’కు దూకుడుతో లింక్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన 'దూకుడు' మూవీ అప్పట్లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. త్వరలో వీరి కాంబినేషన్లో 'ఆగడు' సినిమా రాబోతోంది. దర్శకుడు ఈ చిత్రం టైటిల్‌కు 'దూకుడే దూకుడు' అనే ట్యాగ్ లైన్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా హిట్ సెంటిమెంటు ఈ చిత్రానికి కలిసొస్తుందని ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం అఫీషియల్‌గా ఖరారు కావాల్సి ఉంది.

ప్రస్తుతం 'ఆగడు' స్క్రిప్టు వర్కు దశలోనే ఉంది. 'ఆగడు' సినిమాను రూ. 40 కోట్ల బడ్జెట్ మించకుండా పూర్తి చేయాలని, అప్పుడే నిర్మాతలకు, బయ్యర్లకు మంచి జరుగుతుందని మహేష్ బాబు శ్రీను వైట్లు సూచించినట్లు తెలుస్తోంది. తన సినిమా నష్టాల పాలైతే తనకే చెడ్డపేరు కాబట్టి మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మహేష్ బాబు ఆలోచన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

ఈచిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నాను హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశం ఉంది. దూకుడు చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ఈచిత్రాన్ని కూడా తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టు దశలోనే ఉన్న ఈచిత్రం వచ్చే ఏడాది మొదలు కానుంది.

ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో '1' నేనొక్కడినే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత 'ఆగడు' చిత్రం ఫ్లోర్ మీదనకు వచ్చే అవకాశం ఉంది. ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం వచ్చే ఏడాది ఈ చిత్రం మొదలయ్యే అవకాశం ఉంది.

English summary
Super Star Mahesh Babu and director Srinu Vytla are teaming up second for the Aagadu after their blockbuster film Dookudu. Film Nagar source said that, ‘Aagadu’ tagline would have been confirmed as ‘Dookude Dookudu’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu