»   » తమన్నా స్వీట్ షాప్ బిజినెస్‌....ఇంట్రెస్టింగ్ స్టోరీ!

తమన్నా స్వీట్ షాప్ బిజినెస్‌....ఇంట్రెస్టింగ్ స్టోరీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Aagadu: Tamanna sweet shop business
హైదరాబాద్: రాయలసీమలో హీరోయిన్ తమన్నా స్వీట్ షాప్ ఓపెన్ చేసింది. ఇంతకీ తమన్నాకు ఇపుడు ఈ మిఠాయిలు అమ్ముకునే బిజినెస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనుకుంటున్నారా? ఇదంతా 'ఆగడు' సినిమా షూటింగులో భాగమే. ఈ చిత్రంలో తమన్నా స్వీట్ షాప్ నడిపించే యువతిగా కనిపించబోతోంది. ఇందుకు సంబంధించిన సీన్ల చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

ఈ చిత్రంలో మహేష్ బాబు ఎన్ కౌంటర్ స్పెషలిస్టు పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. రాయల సీమ స్లాంగుతో సరికొత్తగా డైలాగ్ డెలివరీ చేయబోతున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

'దూకుడు' తర్వాత మహేష్‌, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి. మహేష్‌ శైలి వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 26న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ,సంగీతం: ఎస్.ఎస్.తమన్, ఛాయా గ్రహణం: కె.వి.గుహన్. ఆగడు మూవీ ఆడియోను సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

English summary
For Superstar Mahesh Babu's movie 'Aagadu', milky beauty Tamanna is seen running a sweet shop, and right now this sequence is being shot at Ramoji Film City.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu