twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్రమంగా ‘ఆగడు’ టికెట్స్, రంగంలోకి పోలీసులు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పెద్ద హీరోల సినిమాలు విడుదలయ్యాయంటే టికెట్లకు డిమాండ్ ఏ రేంజిలో ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు థియేటర్ల వద్దే బ్లాక్ టికెటింగ్ నడిచేంది. టికెట్ రేటు కంటే నాలుగైదు, డిమాండ్ ఎక్కువగా ఉంటే పది రెట్లు రేటు పెంచేసి బ్లాక్ టికెట్ ముఠా దోపిడీకి పాల్పడేది.

    అయితే ఇపుడు అంతా ఆన్ లైన్ టికెట్ సిస్టం రావడంతో బ్లాక్ టికెట్ ముఠాల ఆగడాలకు అడ్డు కట్టపడిందనే అంతా అనుకున్నారు. అయితే బ్లాక్ టికెట్ గాళ్లు కూడా ఈ విషయంలో సరికొత్త పంథా అనుసరిస్తున్నారు. ముందుగానే టికెట్లను ఆన్ లైన్లో కొనుగోలు చేసి...వాటిని ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, ఓఎల్ఎక్స్, క్వికర్ లాంటి క్లాసిఫైడ్ సైట్లలో ఎక్కువ ధరకు అమ్మేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.

    Aagadu tickets sold illegally

    తాజాగా ‘ఆగడు' టికెట్స్ విషయంలో అలానే జరిగింది. కూకట్ పల్లిలోని విశ్వనాథ థియేటర్లో ఈ రోజు ఉదయం బెనిఫిట్ షో వేసారు. ఈ టెక్కెట్లను కొనుగోలు చేసిన కొందరు 70 రూపాయలు విలువ బాల్కనీ చేసే టిక్కెట్లను రూ. 300లకు గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఫేస్ బుక్ లో అమ్మకానికి పెట్టారు. అవసరమైన వాళ్లు కాల్ చేయాలని అందులో తమ ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఫోన్ చేసిన వారికి 70 రూపాయల టికెట్ రూ. 300లుగా చెప్పారు.స

    అదే విధంగా కొందరు క్వికర్, ఓఎల్ఎక్స్ లాంటి క్లాసిఫైడ్ సైట్లలో టికెట్స్ పెట్టి 70 రూపాయల టికెట్లను రూ. 200 నుండి రూ. 500 వరకు అమ్మకానికి పెట్టారు. ఆన్ లైన్ బ్లాక్ టికెటింగ్ వ్యవహారం.....పోలీసుల వరుకు వెళ్లింది. టాస్క్ ఫోర్స్ బిసిపి బి లింగారెడ్డి మాట్లాడుతూ ఆన్ లైన్ బ్లాక్ టికెటింగుకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

    English summary
    Aagadu tickets sold illegally online. The trend of movie tickets being sold in the 'black' online through social networking sites like Facebook or classified portals like Quikr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X