»   » డబల్ డోస్ కామెడీతో మహేష్ బాబు ‘ఆగడు’

డబల్ డోస్ కామెడీతో మహేష్ బాబు ‘ఆగడు’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, హిట్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో 2011లో వచ్చిన 'దూకుడు' మంచి వినోదాత్మక చిత్రంగా పేరు తెచ్చుకోవడంతో పాటు నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మరో చిత్రం ఆగడు.

దూకుడు చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న షూటింగుల్లో మహేష్ బాబు, వెన్నెల కిషోర్, ఎంఎస్ నారాయణలపై కామెడీ సీన్లు చిత్రీకరిస్తున్నారు. డిసెంబర్ 4 వరకు ఈ షెడ్యూల్ జరుగనుంది.

ఎంటర్టెన్మెంట్ విషయంలో 'ఆగడు' చిత్రం గతంలో తమ కాంబినేషన్లో వచ్చిన 'దూకుడు' చిత్రానికి డబల్ డోస్‌లా ఉంటుందని శ్రీను వైట్ల ఇప్పటికే స్పష్టం చేసారు. అందుకు తగిన విధంగానే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ చిత్రంలో మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసిన వేసవి కానుకగా సినిమాను వచ్చే ఏడాది మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ బాబు-శ్రీను వైట్ల కాంబినేషన్లో ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉండనున్నాయి.

English summary
Super Star Mahesh Babu-Srinu Vaitla upcomming movie "Aagadu" currently being shot in and around Hyderabad. Some comedy scenes are being shot on Mahesh Babu, Vennela Kishore and M.S.Narayana currently. Sreenu Vaitla is excited about the project and he says that the entertainment quotient in ‘Aagadu’ will be more than that of ‘Dookudu’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu