»   » అమిర్ ఖాన్‌తో కంటతడి పెట్టించిన మార్గరిటా

అమిర్ ఖాన్‌తో కంటతడి పెట్టించిన మార్గరిటా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తను నటించిన ‘మార్గరిటా' చిత్రం చూసిన అనంతరం బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కంటతడి పెట్టారని బాలీవుడ్ నటి కల్కి కోచ్లిన్ తెలిపారు. ఆయన భార్య కిరణ్ రావు ఫోర్స్ చేయడంతో ఈ సినిమాకు వచ్చారు. అయితే సినిమా చూసిన అనంతరం ఎమెషన్ అయ్యారని తెలిపారు.

తొలుత ఆయనకు ఆసక్తి లేక పోయినా....ఆయన భార్య కిరణ్ రావు బలవంతం మీద ఈ సినిమా చూడటానికి వచ్చారు. కానీ సినిమా చూసే సమయంలో ఆయన కంటతడి పెట్టకుండా ఉండలేక పోయారు. అమీర్ ఖాన్ కు ఈ సినిమా ఎంతగానో నచ్చింది, సినిమా పూర్తయిన వెంటనే ప్రశంసలతో ముంచెత్తారని హీరోయిన్ కల్కి సంతషం వ్యక్తం చేసారు.

aamir cried after watching the movie margarita

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అందరి ప్రశంసలు అందుకున్న తర్వాత భారత అభిమానుల ముందుకు ఈ చిత్రం త్వరలో రాబోతోంది. ఈ చిత్రంలో కల్కి ఒక 'మస్తిష్క పక్షవాతం'(సెరెబ్రల్ పల్సి) వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి పాత్రలో నటించారు. శోనాలి బోస్ ఈ చిత్రానికి కథ తయారు చేసుకుని స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించారు.

కల్కి కోచ్లిన్, రేవతి, సయాని గుప్తా ముఖ్య పాత్రల్లో నటించారు. మిక్కీ మెక్ క్లేరీ సంగీతం అందించగా అన్నె మిసావా సినిమాటోగ్రఫీ అందించారు. ఏప్రిల్ 17వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Read more about: aamir, margarita
English summary
aamir cried after watching the movie margarita
Please Wait while comments are loading...