»   » దంగల్ కూతుళ్ళతో ఫెమినా కవర్ పేజ్ పై..... "దంగల్" ప్రమోషన్ స్టార్ట్

దంగల్ కూతుళ్ళతో ఫెమినా కవర్ పేజ్ పై..... "దంగల్" ప్రమోషన్ స్టార్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్‌ఖాన్.. లెజండ‌రీ రెజ్ల‌ర్ మ‌హావీర్ పోగ‌ట్ జీవిత నేపథ్యంలో దంగల్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రెజ్లింగ్ నేప‌థ్యంలో త‌న ఇద్ద‌రు కూతుళ్ల క‌ల‌లు సాకారం చేయ‌డానికి పోరాడే తండ్రి పాత్రలో అమీర్ నటించాడు. పీకే లాంటి ప్రయోగాత్మక చిత్రంతో మెప్పించిన అమీర్ ఖాన్ ఇప్పుడు దంగల్ తో మరోసారి అభిమానులు అలరించేందుకు రెడీ అయ్యాడు. ఈ చిత్రం కోసం అమీర్ బాగానే కసరత్తులు చేశాడు. అమీర్‌ ఖాన్‌ ప్రధానపాత్రధారుడిగా ఇండియన్‌ రెజ్లర్‌ మహ్‌వీర్‌ సింగ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూండటం తో. ఇక ప్రమోషన్ కార్యక్రమాలలో స్పీడ్ పెంచుతున్నాడు అమీర్.

ట్రైలర్ కు మంచి రెస్పాన్సే వస్తోంది.ఈ ట్రైలర్ లో ఎమోషన్,హ్యూమర్ లాంటి అన్ని ఎలిమెంట్లు క్యారీ చేశారు.ఇక అమీర్ దంగల్ మూవీలో హర్యానా భాష కోసం క్లాసులకెళ్లి మరీ నేర్చుకున్నాడు.అమీర్ ఖాన్ డ్యూయల్ రోల్ లో కనిపించే దంగల్ మూవీ డిసెంబర్ లో స్క్రీన్ మీదకు రానుంది. ట్రైలర్ లోనే అమీర్‌ ఖాన్‌ తనదైన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. ప్రీతమ్‌ చక్రవర్తి అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ ట్రైలర్‌కు మరో అస్సెట్‌గా నిలిచింది. అదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన ఫెమినా మేగజైన్ కవర్ పేజ్ పై తన తెర మీది కూతుళ్ళతో కనిపించాడు అమీర్.

కంగనా రనౌత్:

కంగనా రనౌత్:

ఈ సినిమాలో అమీర్ కూతుళ్ళలో ఒకరు గా తాను నటిస్తానని కంగనా రనౌత్ ముందుకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే, అందులో నిజం లేదని తేలిపోయింది.ఆ పాత్రలకు ఫిల్మ్ మేకర్స్ కొత్తవాళ్లను తీసుకోవాలని అనుకున్నారు.

 21 వేల మందికి ఆడిషనింగ్:

21 వేల మందికి ఆడిషనింగ్:

ఇందుకు గాను, వారు 21 వేల మందికి ఆడిషనింగ్ నిర్వహించినట్లు సమాచారం. చివరకు ఇద్దరిని ఎంపిక చేశారని చెబుతున్నారు. వారిలో ఒక యువతి ఫాతిమా సానా షేక్ కాగా రెండో యువతి సాన్యా మల్హోత్రా.ఫాతిమా ముంబైకి చెందిన అమ్మాయి.

గీత, బబితా ఫోగట్:

గీత, బబితా ఫోగట్:

ముంబైకి చెందిన నాట్యకళ అకాడమీ డ్యాన్స్ వర్క్స్లో ఆమె డ్యాన్సర్. కాగా, సాన్యా ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఆమె బ్యాలేలో శిక్షణ పొందింది.సాన్యా పలు యాడ్స్లో ఇంతకు ముందు నటించింది. దంగల్ సినిమాను రెజ్లర్ మహవీర్ సింగ్, ఆయన కూతుళ్లు గీత, బబితా ఫోగట్ ల జీవితాల ఆధారంగా నిర్మిస్తున్నారు అన్న విషయం తెలిసిందే కదా.

తొలి మహిళా రెజ్లర్లు:

తొలి మహిళా రెజ్లర్లు:

భారత్‌లో తొలి మహిళా రెజ్లర్లు వచ్చిన కుటుంబం ఏదంటే అది ‘ఫొగట్' కుటుంబం అని చెప్పేయొచ్చు. హర్యానాలోని భివాని జిల్లా బలాలి అనే గ్రామం నుంచి వెళ్లిన ఆరుగురు అక్కాచెల్లెళ్లు రెజ్లింగ్‌లో తమ సత్తా చాటారు.

మహావీర్ సింగ్ ఫొగట్:

మహావీర్ సింగ్ ఫొగట్:

పురుషులకు మహిళలు ఏ మాత్రం తీసిపోరు అని చాటి చెప్పారు. మహావీర్ సింగ్ ఫొగట్.. తాను సాధించలేనిది కూతుళ్ల ద్వారా సాధించాడు. అందులో గీతా ఫొగట్, బబితా ఫొగట్‌లు అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందారు.

ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు:

ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు:

పికె సినిమా తరువాత ఇంత వరకు ఆమిర్ సినిమా రిలీజ్ కాకపోవటంతో అభిమానులు దంగల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే సినిమా రిలీజ్‑కు రెండు నెలల సమయం ఉన్నా ముందుగానే ట్రైలర్‑ను రిలీజ్ చేశారు.

కథ అంతా ట్రైలర్ లోనే:

కథ అంతా ట్రైలర్ లోనే:

దాదాపు సినిమా కథ అంతా ట్రైలర్‑లోనే రివీల్ చేశారు. తన దేశం కోసం బంగారు పతకం సాధించాలనుకున్న మహావీర్ అది సాధ్యం కాకపోవటంతో నిరుత్సాహపడతాడు. తాను చేయలేనిది తన కొడుకు ద్వారా సాధించాలని నిర్ణయించుకున్నాడు.

నలుగురు కూతుళ్లే :

నలుగురు కూతుళ్లే :

అయితే తనకు నలుగురు కూతుళ్లే కావటంతో తన కల నెరవేరదని అనుకుంటున్న సమయంలో.., తన కూతుళ్ల శక్తిని గుర్తించి వారినే రెజ్లర్‑లుగా తయారు చేస్తాడు. రెండు డిఫరెంట్ లుక్స్‑లో కనిపిస్తున్న ఆమిర్, ఆ లుక్స్ కోసం చాలా కష్టపడ్డాడు.

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ :

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ :

వయసైన పాత్ర కోసం లావుగా తయారయ్యాడు. తరువాత కుర్రాడిగా బరిలో దిగే రెజ్లర్ లుక్ కోసం భారీ కసరత్తులు చేసి కండలు తిరిగిన దేహంతో మరోసారి మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు.

షెడ్యూలు రద్దు:

షెడ్యూలు రద్దు:

వంబర్‌ 20న మహావీర్‌ కుమార్తె, కుస్తీ నారి గీతా ఫొగట్‌ వివాహం జరుగుతోంది. ఆ రోజు వేరే షూటింగ్‌ ఉన్నా పెళ్లికి హాజరయ్యేందుకు షెడ్యూలు రద్దు చేసుకున్నాడట ఆమిర్‌. చిత్ర దర్శకుడు నితీశ్‌ తివారీ, కుమార్తెలుగా నటించిన ఫాతిమా సనా షేక్‌, సన్యా మల్హోత్రా సైతం ఈ వేడుకకు వస్తున్నారట.

 డిసెంబర్ 23న విడుదల:

డిసెంబర్ 23న విడుదల:

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న విడుదల చేయనున్నారు. తన ప్రతీ చిత్రానికి డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తూ ఆకట్టుకునే ఆమిర్ ఖాన్.. ఇప్పుడా సెలబ్రేషన్స్ తన స్టైల్ లో స్టార్ట్ చేసేశాడు.

ఇద్దరు అమ్మాయిలతో :

ఇద్దరు అమ్మాయిలతో :

ఫెమినా మేగజైన్ కవర్ పేజ్ పై.. ఇద్దరు అమ్మాయిలతో కలిసి పోజులు ఇచ్చాడు ఆమిర్. డిజైనర్ సూట్.. డిఫరెంట్ గా కట్ చేసిన గడ్డం.. మ్యాన్లీ నెస్ కి మరోపేరులా ఉన్నాడు ఆమిర్. ఈ ఫోటోలో మరో ఇద్దరు భామలు కూడా ఉన్నారు.

ఆమిర్ ఖాన్ కూతుళ్లే:

ఆమిర్ ఖాన్ కూతుళ్లే:

వాళ్లిద్దరి పేర్లు ఫాతిమా సనా షేక్.. సాన్యా మల్హోత్రా. ఆమిర్ కి కాసింత దూరంగా నిలబడి ఒకరు.. కూర్చుని మరొకరు గ్లామర్ అద్దుతున్నారు. వీళ్లెవరో కాదు.. ఆమిర్ ఖాన్ కూతుళ్లే.

ఆన్ స్క్రీన్ డాటర్స్:

ఆన్ స్క్రీన్ డాటర్స్:

కాకపోతే ఆన్ స్క్రీన్ డాటర్స్ అన్నమాట. దంగల్ మూవీలో ఆమీర్ పెద్ద కూతురు గీతా ఫొగట్ గా ఫాతిమా సనా షేక్ నటించగా.. బబితా కుమారి గా సాన్యా మల్హోత్రా యాక్ట్ చేసింది. ఇప్పుడు వీరంతా కలిసి ఫోటో షూట్స్ చేస్తూ.. దంగల్ ప్రమోషన్స్ ను అఫీషియల్ గా స్టార్ట్ చేసేశారు.

English summary
Mr. Perfectionist of Bollywood, Aamir Khan has graced the anniversary cover of the lifestyle magazine Femina with his upcoming movie ‘Dangal’ daughters Sanya Malhotra and Sana Sheikh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu