»   »  ఫొటోలు:కమల్‌ కు అమీర్ ఖాన్ బహిరంగ క్షమాపణ

ఫొటోలు:కమల్‌ కు అమీర్ ఖాన్ బహిరంగ క్షమాపణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ''విశ్వరూపం' విడుదల విషయంలో కమల్‌ హాసన్‌ ఎన్నో ఇబ్బందులెదుర్కొన్నారు. ఆ సమయంలో ఆయనకు మద్దతుగా నిలవలేకపోయినందుకు బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నా'' అని ఆమీర్‌ ఖాన్‌ అన్నారు. వినోద పరిశ్రమకు సంబంధించిన FICCI కార్యక్రమంలో పాల్గొన్న ఆమీర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ముంబయ్‌లో మూడు రోజుల పాటు జరిగిన 'ఫిక్కీ - ఫ్రేమ్స్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమ ప్రారంభం ఆమిర్‌ఖాన్, కమల్‌హాసన్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా పలు విషయాల గురించి ఆమిర్ మాట్లాడారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

''విశ్వరూపం' విషయంలో పరిశ్రమ మొత్తం ఒక్కటై కమల్‌కు బాసటగా నిలవాల్సింది. అయితే పని ఒత్తిడి వల్ల నేను వ్యక్తిగతంగా మద్దతు తెలపలేకపోయా. ఈ విషయమై ఇప్పటికీ చింతిస్తుంటాను'' అని చెప్పారు ఆమీర్‌. నిషేధిత పదాలంటూ సెన్సార్‌ బోర్డు ఇటీవల ఓ జాబితాను విడుదల చేయడం వివాదాస్పదమైన విషయంపైనా ఆమీర్‌ స్పందించారు.

మిగతా విషయాలు స్లైడ్ షోలో...

అమీర్ ఖాన్ మాట్లాడుతూ...

అమీర్ ఖాన్ మాట్లాడుతూ...

''ఏ అంశాన్నైనా సెన్సార్‌ బోర్డు నిషేధించడాన్ని నేను ఆమోదించను'' అన్నారు.

కేవలం సర్టిఫికేషన్ మాత్రమే

కేవలం సర్టిఫికేషన్ మాత్రమే

'సెన్సార్‌ బోర్డు కేవలం సర్టిఫికేషన్‌ చేసే సంస్థేనని దానికి నిషేధించే అధికారం లేద'ని స్వయంగా సమాచార ప్రసార శాఖ మంత్రి చెప్పినట్లు ఆమీర్‌ తెలిపారు.

భాధ్యత ప్రభుత్వాలదే

భాధ్యత ప్రభుత్వాలదే

సెన్సార్‌ బోర్డు అనుమతి పొందిన సినిమాల విడుదలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని ఆమీర్‌ అన్నారు.

చట్టాన్ని చేతులోకి తీసుకున్నట్లే

చట్టాన్ని చేతులోకి తీసుకున్నట్లే

''ఒక చిత్రానికి సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ జారీ అయ్యాక, ఆ చిత్రం విడుదలను అడ్డుకునే హక్కు ఎవరికీ ఉండదు. ఒకవేళ ఎవరైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నట్లే'' అని ఆమిర్ ఖాన్ అన్నారు.

ప్రత్యేకంగా

ప్రత్యేకంగా

వాటిలో సెన్సార్ సర్టిఫికెట్ పొందిన చిత్రాలను నిషేధించడానికి కొందరు చేస్తున్న ప్రయత్నం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా కమల్‌హాసన్ నటించి, దర్శకత్వం వహించిన 'విశ్వరూపం' చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు.

బిజీగా ఉండటం వల్లే..

బిజీగా ఉండటం వల్లే..

''కమల్‌హాసన్ 'విశ్వరూపం' చిత్రాన్ని నిషేధించిన సమయంలో నా పనులతో నేను బిజీగా ఉండటం వల్ల ఈ విషయం గురించి పట్టించుకోలేకపోయాను.

సిగ్గుపడుతున్నా

సిగ్గుపడుతున్నా

వాస్తవానికి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే పరిశ్రమ మొత్తం ఏకతాటిపై నడవాలి. కానీ, ఆ పని చేయడానికి నా వంతుగా నేను ముందుకు రానందుకు సిగ్గుపడుతున్నా.

అందుకే బహిరంగంగా..

అందుకే బహిరంగంగా..

కమల్‌హాసన్‌కి సహాయం చేయలేకపోయినందుకు ఆయనకు బహిరంగంగా క్షమాపణ చెబుతున్నా.

కమల్ గారూ...

కమల్ గారూ...

'కమల్‌గారూ! మీరు ఇబ్బందిలో ఉన్న సమయంలో మీ వెంట మేం లేకపోయినందుకు చాలా బాధపడుతున్నా'.

వ్యతికేరిస్తున్నా

వ్యతికేరిస్తున్నా

సెన్సార్ ఆమోదం పొందిన ఏ చిత్రాన్నీ ఎవరూ నిషేధించకూడదు. అలాంటి నిషేధాలను నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా'' అన్నారు.

కమల్ ఇలా అన్నారు.

కమల్ ఇలా అన్నారు.

'సినిమాల విషయంలో సెన్సార్‌ బోర్డు తన పరిధికి మించి జోక్యం చేసుకుంటోంద'ని ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ విమర్శించారు. 'ఉత్తమ విలన్‌'కు సంబంధించి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సమ్మతించను

సమ్మతించను

''సినిమా వాళ్లు ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పేందుకు సెన్సారు బోర్డు ప్రయత్నిస్తోంది. దీన్ని నేను సమ్మతించను'' అని కమల్‌ అన్నారు.

English summary
Aamir Khan said" I really feel ashamed that at that time I was lost in my work but as an industry that was the time we had to come together. I apologise to you (Kamal Hassan) publicly that I wasn't there at that time. I feel bad that we weren't there with you. Banning a film is not right."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu