»   »  వివాద వ్యాఖ్యల వేడి...ఆమీర్‌ఖాన్‌కి భద్రత ఏర్పాటు

వివాద వ్యాఖ్యల వేడి...ఆమీర్‌ఖాన్‌కి భద్రత ఏర్పాటు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్‌ నటుడు ఆమీర్‌ఖాన్‌కి తగినంత భద్రత ఏర్పాటు చేసినట్లు ముంబయిలోని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. దేశంలో అసహనంపై ఆమీర్‌ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

డిల్లీలో నిన్న జరిగిన రామ్‌నాథ్‌ గోయెంకా ఎక్సెలెన్స్‌ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమీర్‌ ఖాన్‌ దేశంలో అసహనంపై మాట్లాడారు. దేశంలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై తాను కలత చెందినట్లు చెప్పారు. ఇవి తట్టుకోలేక తన భార్య కిరణ్‌రావు.. దేశం వదిలి వెళ్లిపోదామని కోరిందని ఆమీర్‌ చెప్పారు. దీనిపై భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో భద్రత ఏర్పాటు చేశారు.

దేశంలో అసహనంపై బాలీవుడ్‌ నటుడు ఆమీర్‌ఖాన్‌ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపట్ల కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమీర్‌ భారత్‌లో క్షేమంగానే ఉన్నారని.. ఆయన వ్యాఖ్యలతో తన అభిమానులను అవమానించారని భాజపా నేతలు పేర్కొన్నారు.
ఆమీర్‌ఖాన్‌ దేశం వదిలిపోవాలని తాము ఎప్పుడూ చెప్పలేదని.. ఆయన భారత్‌లో క్షేమంగా ఉన్నారని కేంద్ర మంత్రి ముక్తర్‌ అబ్బాస్‌ నఖ్వీ అన్నారు.

Aamir Khan provided 'adequate' security: Police

ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయంగా ప్రభావితం చూపిస్తాయన్నారు. ఆయనను అభిమానించే వారిని ఆమీర్‌ అవమానించారని నఖ్వీ అభిప్రాయపడ్డారు. భాజపా గత ఏడాది అధికారంలోకి వచ్చిందని.. ఇప్పటి వరకు దేశంలో ఎన్ని మతపరమైన హత్యలు చోటుచేసుకున్నాయని మరో కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ప్రశ్నించారు. ఇలాంటి ఘోరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.

ఆమీర్‌ వ్యాఖ్యలపట్ల బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ఖేర్‌ కూడా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై అనుపమ్‌ ట్విట్టర్‌ వేదికగా ఆమీర్‌పై పలు ప్రశ్నలు సంధించారు.

'ఏ దేశం వెళ్దామని మీరు... మీ భార్య కిరణ్‌రావుని అడిగారా. ఈ దేశం మిమ్మల్ని ఆమీర్‌ ఖాన్‌గా గుర్తింపు తెచ్చిపెట్టిందని అనుపమ్‌ఖేర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 'భారత్‌ అసహన దేశంగా మీకు గత 8 నెలల నుంచి అనిపించిందా?. దేశంలో అసహనం ఉంటే భారతీయులకు ఏమని సలహా ఇస్తారు..? భారత్‌ వదిలివెళ్లిపోమని చెబుతారా' అని ప్రశ్నించారు.

English summary
Under attack for his remark over concerns of intolerance in the country, Bollywood actor Aamir Khan has been provided with adequate security, a senior police official said on Tuesday.
Please Wait while comments are loading...