»   » ఆమిర్‌ఖాన్‌ చిత్రంలో నటించాలని ఉందా? అయితే ఇదిగో

ఆమిర్‌ఖాన్‌ చిత్రంలో నటించాలని ఉందా? అయితే ఇదిగో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ చిత్రంలో నటించమంటే అందరికీ ఆసక్తే.అలాంటి అవకాసం వస్తే ఎవరు కాదంటారు. అలాంటి అవకాసమే ఇప్పుడు మీ తలుపు తట్టబోతోంది.

తన ప్రొడక్షన్‌ హౌస్‌కి అందంగా ఉండి చక్కగా పాడగల టీనేజి అమ్మాయి కావాలంటూ ఆమిర్‌ ఖాన్‌ తన ట్విట్టర్‌లో ఓ ప్రకటన ఇచ్చారు. అభ్యర్థులకు ఉండవలసిన అర్హతలను ఆయన ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ ప్రకటన ఏంటో మీరూ చూడండి.

ఆసక్తి ఉన్న వారు తమకు ఇష్టమైన ఓ హిందీ పాటను పాడి ఈమెయిల్‌కి జతచేయాలని కోరుతూ ఓ మెయిల్‌ అడ్రస్‌ కూడా ఇచ్చారు. ఆ మెయిల్ ఎడ్రస్ ఏమిటంటే... casting@akpfilms.com .

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

12-17 సంవత్సరాల మధ్య వయస్సు బాలికలు తమ తల్లిదండ్రులతో సంతకం చేయించిన పరిచయ పత్రాన్ని జతపరుస్తూ వివరాలు పంపాలని ఆమిర్‌ ఖాన్‌ పేర్కొన్నారు. 2001లో ప్రారంభించిన ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ దర్శీల్‌ సఫారీ, ప్రతీక్‌ బబ్బర్‌ వంటి నటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది.

అమీర్ తాజా చిత్రం విషయానికి వస్తే...

దంగాల్ అనే మూవీలో రెజ్లర్ గా కనిపించబోతున్నారు ఆమిర్ ఖాన్... ఇందుకోసం తన బాడీని బాగా బిల్డప్ చేశారు. ప్రముఖ మల్లయోధుడు మహావీర్ ఫోగట్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. మహావీర్ పాత్రను ఆమిర్ ఖాన్ పోషించనున్నారు. ఆయన భార్య పాత్రను పోషించే అవకాశం మల్లికా శెరావత్ కి దక్కనుందని సమాచారం.

Aamir Khan's Banner on Lookout for New Female Face

ఈ చిత్రం గురించి తెలుసుకుని, తనంతట తానుగా ఆమిర్ భార్య పాత్ర చేస్తానని అడిగారట. మల్లిక మంచి నటి కావడంతో ఆమె ప్రతిపాదనను కాదనకుండా, ఈ పాత్ర కోసం ఆడిషన్ చేశారట. అయితే, ఇంకా అధికారికంగా మల్లికతో ఒప్పందం కుదుర్చుకోలేదు. కానీ, ఈ అవకాశం తనకే అని మల్లిక ఫిక్సయిపోయారట.

ఇది ఇలా ఉంటే మహావీర్ ఫోగట్ ఇద్దరు కుమార్తెలు గీత, బబిత పాత్రలకు టీవీ సీరియల్స్‌లో, కొన్ని చిత్రాల్లో నటించిన ఫాలిమానూ, ఢిల్లీకి చెందిన సాన్యఅనే బ్యాలే డ్యాన్సర్‌నూ తీసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది.

English summary
"Aamir Khan Productions is looking for a girl who can sing, in the age group of 12-17. Record a video of yourself singing a Hindi song of your choice and email it (or a link to the video) to: castingakpfilms.com . "Please include a short introduction in Hindi and attach a signed letter of consent from a parent/guardian."
Please Wait while comments are loading...