ప్రియుడి కౌగిలిలో నలిగిపోయిన అమీర్ ఖాన్ కూతురు.. సోషల్ మీడియాలో దారుణంగా..!

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ దాంపత్య జీవితానికి రెండోసారి తెరపడిన విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రెండో భార్య కిరణ్ రావు, అమీర్ ఖాన్ పరస్పర అవగాహనతో విడిపోవాలని నిర్ణయం తీసుకోవడం అభిమానులకు షాక్ కలిగించింది. ఇదిలా ఉండగా అమీర్ ఖాన్ కూతురు తన ప్రియుడు నుపూర్ శిఖారేతో రొమాంటిక్ వ్యవహారం దేశ మీడియాలో పతాక శీర్షికలు ఆకర్షించింది. తాజాగా ఆమె తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే...

ఫిట్‌నెస్ ట్రైనర్‌తో ఇరా ఖాన్

ఫిట్‌నెస్ ట్రైనర్‌తో ఇరా ఖాన్

కొద్దికాలంగా ఇరా ఖాన్ డేటింగ్ వ్యవహారం బాలీవుడ్‌లో ప్రముఖంగా మారింది. సుస్మితా సేన్, ఇతర ప్రముఖులకు ఫిట్‌నెస్ కోచ్‌గా వ్యవహరించిన నుపూర్ శిఖారేతో ప్రేమలోపడింది. అప్పటి నుంచి ఫిట్‌నెస్ పేరుతో వారి మధ్య రొమాన్స్ సంఘటనలు పెరిగిపోయాయనే విషయం సోషల్ మీడియాలో సాక్ష్యాలుగా మిగిలాయి.

గుట్టు సాగిన అఫైర్‌ను

గుట్టు సాగిన అఫైర్‌ను

చాలాకాలం వరకు నుపూర్‌తో గుట్టుగా సాగిన డేటింగ్ వ్యవహారం గత వాలైంటైన్ డే సందర్భంగా అఫీషియల్‌గా బయటపడింది. కొన్ని ఫోటోలు పోస్టు చేసిన ఇరా ఖాన్.. నీతో బంధం కోసం నేను చేసిన బాసలు నాకు గర్వంగా అనిపిస్తు్నాయి. జీవితమంత ఇన నీతోనే అంటూ నుపూర్ శిఖారేపై ప్రశంసలు గుప్పిస్తూ ఇరా ఖాన్ పోస్టు పెట్టింది.

తండ్రి విడాకుల తర్వాత అలా..

తండ్రి విడాకుల తర్వాత అలా..


ఇక తాజాగా అంటే తండ్రి విడాకుల వార్త బయటకు వచ్చిన తర్వాత ముంబై వీధుల్లో ప్రియుడు నుపూర్‌తో కలిసి ఇరా ఖాన్ సందడి చేశారు. తన తండ్రి విడాకులపై పెద్దగా స్పందించడానికి నిరాకరించారు. తండ్రి లైఫ్‌లో చోటు చేసుకొన్న విషయాలను పట్టించుకోకుండా తన రొమాంటిక్ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తింది.

ప్రియుడి ఒడిలో ఒదిగిపోయి

ప్రియుడి ఒడిలో ఒదిగిపోయి


ఇరాఖాన్ రీసెంట్‌గా పోస్టు చేసిన ఫోటోలు మరింత రచ్చ చేశాయి. ప్రియుడు ఒడిలో నలిగిపోతూ.. ముఖంలో విచిత్రమైన భావాలు పలికిస్తూ ఫోటోలకు ఫోజిచ్చారు. నాకు నీవు.. నీకు నేను.. ఈ ప్రపంచంతో సంబంధం లేదంటూ ఫోటోషూట్‌ కోసం ఫోజిచ్చారు. నా ప్రియుడు పెద్ద నాటకాల రాయుడు అంటూ ముద్దుగా టీజింగ్ చేశారు.

నెటిజన్ల కామెంట్లు ఎలా ఉన్నాయంటే

నెటిజన్ల కామెంట్లు ఎలా ఉన్నాయంటే


ఇరా ఖాన్, నుపూర్ శిఖారే మధ్య చోటు చేసుకొన్న రొమాన్స్‌పై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. వారిద్దరి కెమిస్ట్రీ చూసి వామ్మో అంటూ నోళ్లు మూసుకొంటున్నారు. మరికొందరు సో స్పెషల్ కపుల్, బ్యూటిఫుల్ ఫోటోలు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Recommended Video

Aamir Khan and Kiran Rao announce divorce, to remain friends and co-parents
ఇరా ఖాన్ కెరీర్ ఇలా..

ఇరా ఖాన్ కెరీర్ ఇలా..


ఇక ఇరా ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. థియేటర్ రంగంలో ఇప్పుడిప్పుడే రాణిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మేడియా అనే నాటకానికి ఇరా ఖాన్ దర్శకత్వం వహించింది. ఇందులో హాజెల్ కీచ్ లీడ్ పాత్రలో నటించారు. త్వరలోనే బాలీవుడ్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X