For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రానాకు వచ్చి సమస్యే, కంప్లైంట్ ఇచ్చిన అమీర్ ఖాన్ భార్య

  By Srikanya
  |

  ముంబయి: సోషల్ మీడియా తమతో నిరంతరం ఉంటే మీడియాగా సెలబ్రెటీలకు ఎంత హాయిగా అనిపిస్తోందో మరో ప్రక్క రకరకాల సమస్యలనూ తెచ్చిపెడుతోంది. మొన్నీ మధ్యే తెలుగు హీరో దగ్గుపాటి రానా...తన పేర ఫేస్ బుక్ ఎక్కౌంట్ ఓపెన్ చేసారని , దాన్ని వాడవద్దని మొత్తుకున్నారు. ఇప్పుడు మరో సెలబ్రెటీకి ఇలాంటి సమస్యే వచ్చి పడింది.

  బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌ భార్యకిరణ్‌రావ్‌ పోలీసులను ఆశ్రయించింది. తన పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాతెరిచి తన ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తూ స్నేహితులు, బంధువులతో తన పేరుపై చాటింగ్‌ చేస్తున్నట్లు ముంబయిలోని బాంద్రాలో సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

  ఇక కిరణ్ రావు ఆ మధ్యన దేశం మొత్తం సంచలం అయ్యారు. అసహనంపై మాట్లాడుతూ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ దేశం విడిచి వెళ్దామని తన భార్య కిరణ్ రావు అంటోందని అన్నారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా ఆయన భార్య కిరణ్ రావుపై కూడా అందరి దృష్టి పడింది. ఇంతకీ ఆయన భార్య కిరణ్ రావు ఎవరనే ప్రశ్న ముందుకు వచ్చింది.

  Aamir Khan's wife Kiran Rao registers police complaint against Facebook impersonator

  కిరణ్‌ రావుకు తెలంగాణకు విడిదీయరాని సంబంధమే ఉంది. కిరణ్‌ తండ్రి వైపు తాత మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వనపర్తి రాజవంశీకుడు. ఇంజనీరింగ్‌ పట్టభద్రుడైన కిరణ్‌ తండ్రి ఉద్యోగరీత్యా బెంగళూరు, కోల్‌కతా, ముంబైల్లో పనిచేశారు. దీంతో కిరణ్‌ విద్యాభ్యాసం కూడా కోల్‌కతా, ముంబైలలో సాగింది. కోల్‌కతాలోని లొరెటో హౌస్‌లో పాఠశాల విద్య పూర్తి చేసిన కిరణ్‌ ఎకనమిక్స్‌ డిగ్రీని ముంబైలోని సోఫియా కళాశాల నుంచి పొందారు.

  ఆ తర్వాత మాస్‌ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీని ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ నుంచి పొందారు. సినీరంగంపై ఉన్న ఆసక్తితో అశుతోష్‌ గోవర్కిర్‌ వద్ద అసిస్టెంట్‌ డైరక్టర్‌గా చేరిన కిరణ్‌ ఆమీర్‌ఖాన్‌ నిర్మించిన లగాన్‌కు పనిచేశారు.

  ఆ సమయంలో ఆమీర్‌తో ఏర్పడిన పరిచయం పెళ్లి దాకా వెళ్లింది. 2002లో ఆమీర్‌ తన తొలి భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చి కిరణ్‌రావును పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆజాద్‌ అనే బాబు ఉన్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడు అబుల్‌ కలాం ఆజాద్‌ పేరు మీదుగా తన కొడుకుకు ఆజాద్‌ అని పేరు పెట్టినట్లు కిరణ్‌ గతంలో ప్రకటించారు. లగాన్‌ తర్వాత గోవర్కిర్‌ వద్ద స్వదేశ్‌ సినిమాకూ కిరణ్‌ అసిస్టెంట్‌గా చేశారు.

  అనంతరం మీరానాయర్‌ వద్ద మాన్‌సూన్‌ వెడ్డింగ్‌ అనే సినిమాకు అసిస్టెంట్‌గా చేశారు. 2011లో సొంతంగా ఆమీర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ధోబీ ఘాట్‌ అనే సినిమాను స్వీయదర్శకత్వంలో నిర్మించారు. తారే జమీన్‌ పర్‌, జానే తు.. యా జానేనా, తలాష్‌, పీప్‌లీ లైవ్‌, ఢిల్లీ బెల్లీ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

  ఆమీర్‌ నటించిన దిల్‌ చాహతా హై చిత్రంలో చిన్న పాత్రలో కిరణ్‌రావు కనిపిస్తారు. కిరణ్‌రావు 1973 నవంబరులో బెంగళూరులో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు రావు, ఉమ ప్రస్తుతం బెంగళూరులోనే నివాసం ఉంటున్నారు

  English summary
  Film director and Bollywood superstar Aamir Khan’s wife Kiran Rao has filed a complaint with the cyber crime police department after she found out that someone had opened a fake account in her name. The person was also chatting with Kiran’s family members and friends.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X