»   » ఆరాధ్యకు గాయం, మీడియాపై ఫైర్ అయిన ఐశ్వర్యరాయ్

ఆరాధ్యకు గాయం, మీడియాపై ఫైర్ అయిన ఐశ్వర్యరాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బిడ్డ బాధపడితే, తల్లి మనసు తట్టుకుంటుందా?.... అదే తన బిడ్డ బాధకు గురవ్వడానికి, లేదా హర్ట్ అవడానికి ఎవరైనా కారణం అయితే తల్లి మనసు అస్సలు ఉపేక్షించదు, ఎదురు దాడి చేస్తుంది. తాజాగా హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కూడా ఇలానే స్పందించారు.

తన కుమార్తెకు గాయం గాయపడటానికి(చిన్న దెబ్బ తగిలి ఏడ్చింది) కారణమైన వారిపై ఫైర్ అయింది. కుమార్తె గాయపడటానికి కారణం మరెవరో కాదు.... మీడియా ప్రతినిధులే నంట. ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ కరణ్ జోహార్ మూవీ ‘యే దిల్ హై ముష్కిల్‌' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మధ్య సినిమా షూటింగులకు కూడా తన బిడ్డను తీసుకోలుతోంది ఐశ్వర్యరాయ్. షూటింగ్ పూర్తయిన తర్వాత కూతురు ఆరాధ్యతో పాటు ఇంటికి వెళ్లేందుకు ఐశ్వర్యారాయ్ సిద్ధమయ్యారు. షూటింగ్ స్పాట్లో నుండి తన కారులో ఎక్కే క్రమంలో ఒక్కసారిగా మీడియా వారు మీదపడ్డారు.

మీడియా ఫోటోగ్రాఫర్లు తల్లీ కూతుళ్లను ఫోటోలు తీసేందుకు ఎగబడటం... వారి నుండి తప్పించుకునే క్రమంలో ఐశ్వర్య వేగంగా వెళ్లారు. ఈ క్రమంలో ఆరాధ్యకు కారు డోర్ తగిలి చిన్నపాటి గాయం అయింది. దీంతో ఆరాధ్య ఏడుపు ప్రారంభించింది. దీనికి మూల కారణం మీడియా వారేనంటూ వారిపై అమ్మోరులా కన్నెర్ర చేసింది ఐశ్వర్యరాయ్.

ఐశ్వర్యరాయ్ తన కూతురు ఉన్న ఫోటోలు కొన్ని స్లైడ్ షోలో...

ఐశ్వర్యరాయ్

ఐశ్వర్యరాయ్

తన కూతురు ఆరాధ్యతో కలిసి ఐశ్వర్యరాయ్..

కూతురంటే ప్రాణం

కూతురంటే ప్రాణం

ఏ తల్లికైనా తమ బిడ్డలంటే ప్రాణం కంటే ఎక్కువ. ఐశ్వర్యరాయ్ కూడా అందుకు అతీతం ఏమీ కాదు.

తన వెంటే..

తన వెంటే..

ఐశ్వర్య ఎక్కడికెళ్లినా తన కూతురును వెంటేసుకునే వెలుతున్నారు. విదేశాల్లో అవార్డైనా, ఇటీవల ఫ్రాన్స్ అధ్యక్షుడి విందుకైనా ఆమె తన కూతురుతో కలిసి వెళ్లారు.

కంటికి రెప్పలా..

కంటికి రెప్పలా..

ఐశ్వర్య తన కూతురు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. సాధారణంగా సినీ సెలబ్రిటీలు పిల్లల ఆలనా పాలనా పనివాళ్లు అప్పగిస్తారనే వాదన ఉంది. కానీ ఐశ్వర్యరాయ్ తాను అలా కాదని నిరూపించుకుంటోంది ఐశ్వర్య.

English summary
Aishwarya Rai Bachchan got really angry at the media recently, when she was trying to get out of her vanity van with her daughter Aaradhya Bachchan. Aishwarya Rai Bachchan was in a hurry but some reporters tried to surround her and in the process Aaradhya hurt herself, before getting into the car. This made Aishwarya lost her cool and she left the venue without answering any question.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu