»   » అబ్బాస్ కిరోస్తామి ఙ్ఞాపకాల్లో... లామకాన్ లో మూడురోజుల ఫిలిం ఫెస్టివల్

అబ్బాస్ కిరోస్తామి ఙ్ఞాపకాల్లో... లామకాన్ లో మూడురోజుల ఫిలిం ఫెస్టివల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సున్నితమైన కథాంశాల్ని అత్యంత సృజనాత్మకంగా తెరకెక్కించడం..ప్రేక్షకుడిని చిత్రంలో లీనం చేయడం కొద్దిమందికే సాధ్యమవుతుంది. అలాంటి చిత్ర దర్శకుల్లో అబ్బాస్ కిరోస్తామీ ముందువరుసలో ఉంటారు. ప్రపంచ సినీ చరిత్రలో కిరోస్తామీది ప్రత్యేక శైలి. 1940లో ఇరాన్‌లోని టెహ్రాన్‌లో జన్మించిన ఆయన బహుముఖ ప్రజ్ఞాశీలి.

బాల్యం నుంచే కళలపై ప్రేమను పెంచుకున్న కిరోస్తామీకి లలిత కళలు, ఫొటోగ్రఫీ, చిత్రకళలో ప్రవేశించారు. సినిమాను కళాత్మక మాద్యమంగా ఎంచుకొని సమర్థవంతంగా తన భావాలకు దృశ్యరూపమిచ్చాడు.

అకిరా కురొసావా వంటి సినీ దిగ్గాల ప్రశంసలు అందుకున్న అరుదైన దర్శకుడు కిరోస్తామీ. తొలినాళ్లలో టీవీ కమర్షియల్ యాడ్స్ రూపొందించిన ఈయన 1970లో 'ది బ్రెడ్ అండ్ అల్లీ' లఘు చిత్రం ద్వారా ఫిల్మ్ మేకర్ అయ్యారు. అలా..పూర్తిస్థాయి ఫీచర్స్ ఫిల్మ్ వైపు మళిన కిరోస్తామీ నలభైకి పైగా చిత్రాలు, డాక్యుమెంటరీలు, లఘుచిత్రాలు రూపొందించారు.

Abbas Kiarostami Film Fest in Hyderabad Lamakaan

వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ఆయన ఇటీవల మరణించారు. ఆయన స్మృతిలో నేటి నుంచి మూడు రోజుల పాటు లామకాన్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. మంగళవారం సాయంత్రం ప్రముఖ తెలుగు సినీ దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ ఫెస్టివల్ ప్రారంభించడంతో పాటు అబ్బాస్ కిరోస్తామీ సినీ జీవితంపై ప్రసంగిస్తారు.

అనంతరం 'వేర్ ఈజ్ ది ఫ్రెండ్స్ హోమ్' చిత్రాన్ని ప్రదర్శించనుట్లు నిర్వాహకులు తెలిపారు. బుధ, గురు వారాల్లో సైతం ప్రేక్షకుల కోసం ఉచితంగా చిత్రాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. మీరూ ప్రపంచ ప్రసిద్ది పొందిన చిత్రాలను చూడాలనుకుంటే బంజారాహిల్స్‌లోని లామకాన్‌ని సందర్శించొచ్చు

ఫిల్మ్ ఫెస్ట్
19 జూలై: వేర్ ఈజ్ ది ఫ్రెండ్స్ హోమ్ (అబ్బాస్ కిరోస్తామీ)
20 జూలై : కిస్ ఆఫ్ ది స్పైడర్ ఉమెన్ (హెక్టర్ బబెన్కో)
21 జూలై : ది డీర్ హంటర్ ( మైకెల్ సిమినో)
వేదిక : లామకాన్ సమయం : రోజూ సాయంత్రం 7 గంటలకు

English summary
Tribute Film Festival of Abbas Kiarostami an Iranian Director Who is Died on 4 July 2016. and Screaning of his films followed by the movie Khane-ye doust kodjast?: Where is the Friend's Home?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu