»   »  ఆ హీరోలిద్దరూ ఆ టైపా?

ఆ హీరోలిద్దరూ ఆ టైపా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
John-Abhishek
మేం'గే'లము...యా...వీడు నా భాయ్ ప్రెండ్ ('Hum Gay Hain!...Yeh Mera Boyfriend Hai') అంటూ అభిషేక్ ని చూపెడుతూ జాన్ అభ్రహం డైలాగ్ చెప్పే దోస్తానా ప్రోమో ఒకటి యష్ చోప్రావారి లేటెస్ట్ సినిమా బచ్నా...యా హసీనో తో పాటు వేస్తున్నారు.దాంతో మీరు వేరే రకంగా ఆలోచించుకోండి అంటున్నట్లు ఈ ప్రొమోలు అనుమానం రప్పిస్తున్నాయి. అభిషేక్‌ నోట్లో రోజా పూవు పెట్టుకొని జాన్‌ అబ్రహమ్‌ చేతిలో చేయి వేసి- ఒకరి నడుము ఒకరు సుతారంగా పట్టుకొని నృత్యం చేయడం... ఓ అమ్మాయి ముందు మేమిద్దరం ఆ టైపు అని చెప్పడం లాంటివి ఆ ప్రోమోలో ఉన్నాయి.

వీటిని చూసిన సినీ జనాలు మాత్రం ఇందులో వీరిద్దరూ అటు ఇటుగాని పాత్రల్లో కనిపిస్తున్నారని చెబుతున్నారు.అందులోనూ ఈ సినిమాలో వీళ్ళిద్దరూ లవర్స్ లా కనిపిస్తారని ఓ టాక్ నడుస్తోంది.నవంబర్ 14 న రిలీజయ్యే ఈ సినిమాని కరణ్ జోహార్ నిర్మిస్తుండగా తరుణ్ మనుసుకని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా,బాబిడయోల్ మిగతా ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. అలాగే శిల్పాశెట్టి తో ఈ ఇద్దరు హీరోల స్పెషల్ సాంగ్ ఒకటి ఉంటుంది.

అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం దోస్తానా సినిమా కథ ఓ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ.జాన్ అబ్రహం,అభిషేక్ ఇద్దరూ బెస్ట్ ప్రెండ్స్ గా ఈ సినిమాలో కనిపిస్తారు.ఒకరి కోసం మరొకరు ప్రాణాలు ఇచ్చే వీరికి ఓ సమస్య వస్తుంది. అభిషేక్ వెళ్ళి ప్రియాంకా చోప్రాతో ప్రేమలో పడతాడు. కానీ ప్రియాంక జాన్ ని ఇష్టపడుతుంది. దాంతో ఈ విషయం తెల్సుకున్న జాన్ త్యాగానికి సిద్దపడతాడు.తానో గే నని ఆమె దగ్గర చెప్తాడు. దాంతో ఆమె అభిషేక్ కి దగ్గరవుతుందని అతని ప్లాన్ .అయితే ఈ లోగా నిజమైన గే బాబి డయోల్ రంగంలోకి దిగుతాడు. అతను జాన్ వెనుక పడటం ప్రారంభిస్తాడు. అప్పుడేం జర్గిందనేది మిగతా కథ.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X