»   » ఏడేండ్ల తర్వాత ఆయనతో.. కాదు వారిద్దరితో.. ఐశ్వర్య మోజు

ఏడేండ్ల తర్వాత ఆయనతో.. కాదు వారిద్దరితో.. ఐశ్వర్య మోజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్, జూనియర్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ తెరమీద కనిపిస్తే ప్రేక్షకులకు పండగే. వారిద్దరి కెమిస్ట్రీ అదుర్స్ అనిపించేలా ఉంటుందనే సగటు ప్రేక్షకుడి అభిప్రాయం. 2010లో మణిరత్నం దర్శకత్వంలో రావన్ చిత్రం తర్వాత వారిద్దరూ కలిసి నటించలేదు. దాదాపు ఏడేండ్ల తర్వాత మళ్లీ బచ్చన్ జోడి వెండితెరపై వెలుగులు విరజిమ్మడానికి సిద్ధమవుతున్నారు.

 అనురాగ్ కశ్యప్ దర్వకత్వంలో

అనురాగ్ కశ్యప్ దర్వకత్వంలో

ఈ స్టార్ జోడి ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ డైరెక్షన్‌లో నటించనున్నారని తాజాగా ఓ వార్త విస్తృతంగా ప్రచారమవుతున్నది. అనురాగ్ కశ్యప్ తీసే గులాజ్ జామున్ చిత్రంలో నటించనున్నారు. రొమాంటిక్ కామెడీ చిత్రంలో వీరిద్దరూ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

స్క్రిప్ట్‌పై మోజు పడ్డ బచ్చన్ జోడి

స్క్రిప్ట్‌పై మోజు పడ్డ బచ్చన్ జోడి

అనురాగ్ కశ్యప్ స్క్రిప్ట్‌ను ఐశ్వర్యరాయ్ అభిషేక్ చాలా ఇష్టపడ్డారట. అయితే నిర్మాతలకు అధికారికంగా ఇంకా వెళ్లడించలేదట. ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు బాలీవుడ్‌లో ఓ రూమర్ ప్రచారం జరుగుతున్నది.

ఫొటో పోస్ట్ చేసిన జూనియర్

ఫొటో పోస్ట్ చేసిన జూనియర్

ఐశ్వర్యతో కలిసి నటిస్తున్నట్టు చెప్పే విధంగా జూనియర్ బచ్చన్ ఇటీవల రావన్ చిత్రంలోని ఫొటోను పోస్ట్ చేశారు. దాంతో వారిద్దరూ అనురాగ్ కశ్యప్ చిత్రంలో నటిస్తున్నారనే విషయానికి మరింత బలం చేకూరింది. ఈ చిత్రానికి అనురాగ్ కశ్యప్ నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది.

బిగ్ బీ, జూనియర్‌ బచ్చన్‌తో ఐశ్వర్య

బిగ్ బీ, జూనియర్‌ బచ్చన్‌తో ఐశ్వర్య

అమితాబ్, అభిషేక్, ఐశ్వర్యరాయ్ చివరిసారిగా బంటీ ఔర్ బబ్లీలో కలిసి నటించారు. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో తండ్రి, కొడుకులతో ఐశ్వర్య స్టెప్పులు వేసింది. పెళ్లి తర్వాత మళ్లీ ఈ ముగ్గురు కలిసి నటించిన దాఖలాలు లేవు.

గతంలో వెండితెరపై..

గతంలో వెండితెరపై..

కుచ్ నా కహో, ధాయి అక్షర్ ప్రేమ్ కే, గురు, ఉమ్రావ్ జాన్, ధూమ్ 2, సర్కార్ రాజ్ చిత్రాల్లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ జంట మెరుపులు మెరిపించింది.

English summary
According to recent reports, Abhishek Bachchan and Aishwarya Rai Bachchan are all set to reunite on screen in Anurag Kashyap's Gulab Jamun.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu