»   » కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ : ఐష్ పరువుతీసేలా ప్రవర్తించిన అభిషేక్ (వీడియో)

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ : ఐష్ పరువుతీసేలా ప్రవర్తించిన అభిషేక్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  కాన్స్: ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా సాగే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐశ్వర్యరాయ్ గత 15 ఏళ్లుగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సారి కూడా ఐష్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేసింది. తన తాజా సినిమా 'సరబ్జీత్' చిత్రాన్ని ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు కూడా. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తన భర్త అభిషేక్ తో కలిసి పాల్గొన్న ఐష్.....భర్త ప్రవర్తనతో కాస్త ఇబ్బంది పడ్డట్లు స్పష్టమవుతోంది.

  ఎంతో మర్యాద పూర్వకంగా ప్రవర్తించాల్సిన ఇలాంటి పెద్ద వేడుకల్లో అభిషేక్ తన భార్య ఐష్ ను బ్యాడ్ గా ట్రీట్ చేసాడనే విమర్శలు వస్తున్నాయి. అభిషేక్ ఎందుకు ఇలా చేసాడు? అతడు అయిష్టంగానే ఈ వేడుకకు హాజరయ్యాడా? లేక మరేమైనా కారణం ఉందా అనేది చర్చనీయాంశం అయింది. అభిషేక్ ప్రవర్తన ఎలా ఉందో ఈ క్రింది వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

  Abhishek Bachchan Treats Aishwarya Badly At Sarbjit Red Carpet

  కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించిన ఐశ్వర్యరాయ్ తాజా సినిమా 'సరబ్జీత్' వివరాల్లోకి వెళితే...

  పాకిస్థాన్ జైల్లో ఇరవైమూడు సంవత్సరాల పాటు బందీగా వుండి హత్యకు గురైన భారతీయ ఖైదీ సరబ్జీత్‌సింగ్ నిజ జీవితకథతో దర్శకుడు ఓమంగ్‌కుమార్ (మేరీకోమ్ ఫేమ్) 'సరబ్జీత్‌' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సరబ్జీత్‌సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా నటిస్తున్నాడు. ఆమె సోదరి దల్బీర్‌కౌర్ పాత్రలో ఐశ్వర్యరాయ్ మెయిన్ రోల్ చేస్తోంది.

  1990 సంవత్సరంలో మద్యం మత్తులో పాకిస్థాన్ భూభాగంలోకి ప్రశేశించిన సరబ్జీత్‌సింగ్ ను భారతీయ గూఢచారిగా అనుమానించిన పాక్‌సైన్యం జైల్లో నిర్భందించింది. లాహోర్ జైల్లో 23 సంవత్సరాల పాటు వున్న సరబ్జిత్‌ను భారత పార్లమెంట్‌పై దాడిచేసిన అఫ్జల్‌గురు మరణశిక్షకు ప్రతీకారంగా సహచర ఖైదీలు మూడేళ్ల క్రితం జైల్లోనే హత్య చేశారు. సరబ్జీత్‌సింగ్ జైల్లో ఉండగా కలిసి వచ్చిన ఆయన సోదరి దల్బీర్‌కౌర్ అక్కడ జైల్లో తన సోదరుడు పడ్డ నరకయాతనను స్వయంగా చూసింది. ఆమె అనుభవాలే కథాంశంగా సినిమా రాబోతోంది.

  English summary
  On 18th May, the premiere of Sarbjit was held at PVR in Mumbai and many celebs along with the Bachchan family graced the event. Everything was going well till Abhishek lost his cool over leaving wife Aishwarya Rai Bachchan embarrassed. He walked away and left her wife alone while both were posing for media. Click to know what exactly happened between the two.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more