For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలకృష్ణ సొంత వెబ్‌సైట్‌ ఇదే..

  By Srikanya
  |

  హైదరాబాద్ : నందమూరి అభిమానులందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు నందమూరి బాలకృష్ణ ఓ వెబ్‌సైట్‌కు రూపకల్పన చేస్తున్న సంగతి తెలిసిందే. www.nandamuri.com పేరుతో ఉండే ఈ వెబ్‌సైట్‌ నేటి సాయంత్రం నుంచి అందుబాటులోకి రానుంది. ఇందులో నందమూరి తారకరామారావు గురించి , బాలకృష్ణ సినిమాల వివరాలు, ఫొటోలు, వీడియోలు తదితర అంశాలు ఉంటాయి. ఇందులోనే అభిమానులు సభ్యత్వాన్ని నమోదు చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. ఈ వెబ్‌సైట్‌కు బాలకృష్ణ జూన్‌10న శ్రీకారం చుట్టారు.

  బాలకృష్ణ మాట్లాడుతూ....నందమూరి అభిమానులు చేస్తున్న సేవాకార్యక్రమాలు, ఇతర వివరాలు పొందు పరచడంతో పాటు, వారు చేస్తున్న కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేందుకు ఈ వెబ్ సైట్ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అభిమానం అనేది గుండె లోతుల్లోంచి రావాలని, అభిమానులను డబ్బు ఎరగా చూపో, లేక ప్రభాలోభపెట్టో సంపాదించుకోలేమని సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. జన్మనిచ్చింది తారకరామారావు దంపతులు అయితే, తనను ఇంత వాడిని చేసిందిన అభిమానులే అని, కొందరు ఆశించడానికి పుడతారు, మరికొందరు శాసించడానికి పుడతారు అంటూ వ్యాఖ్యానించారు. నందమూరి డాట్ కామ్‌లో బాలయ్యతో పాటు నందమూరి కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తారని తెలుస్తోంది.

  ఇక బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట. అనిల్ సుంకర, సాయి కొర్రపాటి నిర్మాతలు. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటి వరకు 25 శాతం చిత్రీకరణ పూర్తయింది. జగపతిబాబు విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా మెయిన్ హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేస్తున్నారని చిత్ర వర్గాల సమాచారం. సెకెండ్ హీరోయిన్‌గా సొనాల్ చౌహాన్‌ను ఇప్పటికే ఎంపిక చేశారు. అయితే క్రేజీ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, అనుష్క, తమన్నా, అంజలిలను సంప్రదించిన దర్శకుడు బోయపాటి శ్రీను చివరికి కాజల్ అగర్వాల్‌ను మెయిన్ హీరోయిన్ గా ఖరారు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

  సింహా లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత మరోసారి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతోంది. ఈ చిత్రం ఎలా ఉండబోతోందనే అంచనా అభిమానుల్లో ఉండటం సహజం. ఈ నేపధ్యంలో బోయపాటి శ్రీను క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ... సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా. అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. 'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అన్నారు.

  అలాగే బాలకృష్ణ నుంచి ప్రేక్షకులు, అభిమానులూ ఏం కోరుకొంటారో అవన్నీ మేళవిస్తూ.. ఆయన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నా. రాజకీయ అంశాలూ ఉంటాయా? అని అందరూ అడుగుతున్నారు. అవీ ఉంటాయి. కానీ.. కథకు ఎంత వరకూ అవసరమో అంతే. ఆ గీత దాటి బయటకు వెళ్లవు అన్నారు. చిత్రానికి 'రూలర్' టైటిల్ అని, మోహన్‌లాల్ కీలక పాత్ర చేస్తారని, నయనతార హీరోయిన్ అనీ.. ఇలా ఏవేవో ప్రచారమవుతున్నాయి. వీటిలో ఒక్కటి కూడా నిజం కాదు.

  అలాగే ఇందులో రాజకీయ అంశాలుంటాయని కూడా భావిస్తున్నారు. నేను కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిని కాబట్టి.. ఆ విలువలు కచ్చితంగా ఈ చిత్రంలో ఉంటాయి. భావోద్వేగాలు ఉంటాయి. 'సింహా'లో బాలయ్యలో కనిపించిన వాడి వేడి ఏ మాత్రం తగ్గవు. అందరూ అనుకుంటున్నట్లు రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఉంటాయో లేదో చెప్పలేను. ఒకవేళ ఉంటే.. పైన చెప్పిన అంశాలకు ఇవి బోనస్ అవుతాయి. అంతేకానీ అవి లేకుండా పాలిటిక్స్‌కే పరిమితం అయ్యే సినిమా కాదు.

  English summary
  Tollywood actor Nandamuri Balakrishna's Nandamuri Web Site availability from Today evening . Balakrishna new movie under Boayapti Srinu direction opening held at Ramakrishna Studios
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X