»   » కేక పెట్టిస్తున్న మహేష్ 'ఖలేజా' ఫస్ట్ లుక్ పోస్టర్...

కేక పెట్టిస్తున్న మహేష్ 'ఖలేజా' ఫస్ట్ లుక్ పోస్టర్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన 'ఖలేజా' చిత్రం పోస్టర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కత్తి పట్టుకుని ఒంటెలు, ఇసుక కలగలసిన రాజస్ధాన్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న మహేష్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కనపడుతున్నారు. దాదాపు కథలో చాలా భాగం రాజస్ధాన్ లోని ఓ గ్రామం లో జరుగుతుంది కాబట్టి ఈ పోస్టర్ వేసారంటున్నారు. అలాగే ఈచిత్రంలో మొదటినుంచీ ప్రచారంలో ఉన్నట్లుగానే మహేష్..క్యాబ్ డ్రైవర్ గా ఉంటాడు. అనుష్క హీరోయిన్ గా నటించే ఈ చిత్రం రిలీజ్ డేట్ ఇంకా ఇవ్వలేదు. ఈ చిత్రానికి సంభందించి రెండు పాటల షూటింగ్ బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. అతిధి తర్వాత చాలా గ్యాప్ తో వస్తున్న మహేష్ చిత్రం కావటంతో ఈ ఖలేజాపై మంచి అంచనాలే ఉన్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu