»   » నారా రోహిత్ సమర్పించేంత నమ్మకం వెనక..

నారా రోహిత్ సమర్పించేంత నమ్మకం వెనక..

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరస ఫెయిల్యూర్స్ తో వెళ్తున్న నారా రోహిత్ ఈసారి ఓ డిఫరెట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావటానికి ప్లాన్ చేసుకున్నాడు. ఈ సినిమాపై ఖచ్చితంగా హిట్ కొడుతుందనే నమ్మకంతో ఉన్నారు. రోహిత్.. శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మూవీ 'అప్పట్లో ఒకడుండేవాడు'. ఈ మూవీ ట్రైల‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రీసెంట్ గా ఈ చిత్రం ఆడియో పంక్షన్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. 1990 నాటి ఒక సంఘ‌ట‌న ఆధారంగా యాక్ష‌న్ మూవీ గా రాబోతున్న‌ది. 'అయ్యారే' ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను 'అసుర' దర్శకుడు కృష్ణవిజయ్ తో కలిసి ప్రశాంతి నిర్మిస్తోంది. నారా రోహిత్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం విశేషం.

వశిష్ఠ మూవీస్‌ పతాకంపై హరివర్మ, సన్నీరాజ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్‌ ముస్లిం యువకుడిగా కనిపించబోతున్నారు. రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 1992-96 మధ్య ఇద్దరు యువకుల జీవితాల్లో చోటు చేసుకొన్న కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. 'ప్రేమ ఇష్క్‌ కాదల్‌' చిత్రంలో రాయల్‌ రాజుగా నటించి మెప్పించిన శ్రీవిష్ణు ఇందులో మరో హీరో గా నటిస్తున్నారు. పోసాని కృష్ణమురళీ, రాజీవ్‌ కనకాల, రఘు కారుమంచి, ప్రభాస్‌ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌, కెమెరా: నవీన్‌ యాదవ్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌.

English summary
Appatlo Okadundevadu film is based on the real incidents in the life of two youngsters between 1992 and 1996.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu