twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అత్తారింటికి దారేది’ పైరసీ నిందితులు వీరే..(ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'అత్తారింటికి దారేది' చిత్రం పైరసీని కేవలం రెండు రోజుల్లోనే చేధించారు. మచిలీపట్నంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ప్రభాకర్ రావు నిందితులను బుధవారం సాయంత్రం మీడియా ముందు ప్రవేశ పెట్టారు. 35 మందిని విచారించిన అనంతరం మొత్తం ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఐటీ యాక్టు, కాపీరైట్ యాక్టు, చీటింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.

    'అత్తారింటికి దారేది' ప్రొడక్షన్ టీంలో పని చేస్తున్న అరుణ్ కుమార్‌ను పోలీసులు ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. అతని ద్వారానే 'అత్తారింటికి దారేది' పూర్తి చిత్రం(రెండు సీడీలు) బయటకు లీకైంది. ఆ తర్వాత పలువురి చేతులు మారి ఇంటర్నెట్లోకి ఎక్కింది. అయితే ఆన్‌లైన్లో కేవలం సగ భాగం(ఒక సీడీ) మాత్రమే లీక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ పైరసీ వ్యవహారంలో ముగ్గురు ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల హస్తం కూడా ఉండటం గమనార్హం.

    ప్రొడక్షన్ హౌస్ ఇంటర్నెట్ వరకు ఇలా...

    'అత్తారింటికి దారేది' ప్రొడక్షన్ టీంలో ఎడిటర్ అసిస్టెంటుగా పని చేస్తున్న అరుణ్ కుమార్ ప్రసన్నకుమార్‌కు, ప్రసన్న కుమార్ ద్వారా అనూప్ అనే కానిస్టేబుల్‌కు, అతని ద్వారా ఏపీఎస్పీ కానిస్టేబుల్ రవికుమార్‌కు సీడీలు అందాయి. రవి కుమార్ వాటిని సెప్టెంబర్ 14న కొరియర్ ద్వారా కృష్ణా జిల్లా పెడనకు పంపారు. అనిల్ కుమార్ కుమార్ ద్వారా మచిలీపట్నంలో ఇంటర్నెట్లోకి అప్ లోడ్ అయింది.

    ఈ వ్యవహారంలో మొబైల్ షాపు, ఇంటర్నెట్ నిర్వహిస్తున్న సురేష్, సుధీర్ కుమార్‌, గిరి కూడా ఉన్నారు. సురేష్ దగ్గర సీడీలు దొరకడంతో అతన్ని విచారించగా డొంకంతా కదిలిందని పోలీసులు తెలిపారు. ఇంటర్నెట్లో సినిమా లీకైన విషయం తెలుసుకున్న వెంటనే నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేసారు. సైబర్ క్రైం విభాగం వారి హెల్ప్‌తో ఇంటర్నెట్ లింకులను బ్లాక్ చేసారు.

    ఎవరి ప్రొద్బలం లేదని చెప్పిన నిందితులు

    నిందితులు మాట్లాడుతూ...సీడీలు బయటకు లీక్ చేయడం వెనక ఎవరి ప్రొద్బలం లేదని, ఎవరూ కుట్ర చేయలేదని, కేవలం స్నేహితుల కోసమే తాను ఈ పని చేసినట్లు ప్రధాన నిందితుడు అరుణ్ కుమార్ తెలిపారు. ఎస్పీ ప్రభాకర్ మాట్లాడుతూ....సినిమా రంగం వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ఇంటి దొంగలపై ఓకన్నేసి ఉంచాలని సూచించారు.

    నిందితులు

    నిందితులు

    అత్తారింటికి దారేది చిత్రం పైరసీ కేసులో పోలీసులు కస్టడీలోకి తీసుకున్న ఐదుగురు నిందితులను మచిలీపట్నం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ప్రభాకర్ మీడియా ముందు హాజరు పరిచారు.

    ఎస్పీ ప్రభాకర్

    ఎస్పీ ప్రభాకర్

    అత్తారింటికి దారేది చిత్రం పైరసీ వ్యవహారాన్ని, నిందితులను ఎలా పట్టుకున్నామనే విషయాలను వెల్లడిస్తున్న కృష్ణా జిల్లా ఎస్పీ ప్రభాకర్.

    చేతులు మారిన సీడీలు

    చేతులు మారిన సీడీలు

    ‘అత్తారింటికి దారేది' ప్రొడక్షన్ టీంలో ఎడిటర్ అసిస్టెంటుగా పని చేస్తున్న అరుణ్ కుమార్ ప్రసన్నకుమార్‌కు, ప్రసన్న కుమార్ ద్వారా అనూప్ అనే కానిస్టేబుల్‌కు, అతని ద్వారా ఏపీఎస్పీ కానిస్టేబుల్ రవికుమార్‌కు సీడీలు అందాయి. రవి కుమార్ వాటిని సెప్టెంబర్ 14న కొరియర్ ద్వారా కృష్ణా జిల్లా పెడనకు పంపారు. అనిల్ కుమార్ కుమార్ ద్వారా మచిలీపట్నంలో ఇంటర్నెట్లోకి అప్ లోడ్ అయింది.

    ఇంటి దొంగలపనే

    ఇంటి దొంగలపనే

    ఎస్పీ ప్రభాకర్ మాట్లాడుతూ....సినిమా రంగం వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ఇంటి దొంగలపై ఓకన్నేసి ఉంచాలని సూచించారు.

    అరుణ్ కుమార్

    అరుణ్ కుమార్

    నిందితులు మాట్లాడుతూ...సీడీలు బయటకు లీక్ చేయడం వెనక ఎవరి ప్రొద్బలం లేదని, ఎవరూ కుట్ర చేయలేదని, కేవలం స్నేహితుల కోసమే తాను ఈ పని చేసినట్లు ప్రధాన నిందితుడు అరుణ్ కుమార్ తెలిపారు.

    English summary
    Accused in Attarintiki Daredi piracy case produced before media today in Machilipatnam SP office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X