»   » మిసెస్ ఇండియా ఫైనల్ రౌండ్లో: విలన్ అజయ్ భార్య

మిసెస్ ఇండియా ఫైనల్ రౌండ్లో: విలన్ అజయ్ భార్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

లక్ష్మీ కళ్యాణం'లో విలన్‌గా చక్కని గుర్తింపు తెచ్చుకున్న అజయ్‌, 'విక్రమార్కుడు' సినిమాతో ఔరా అనిపించుకున్నాడు. విలన్‌గా పుష్కలమైన అవకాశాలు వస్తున్న సమయంలోనే 'ఆ ఒక్కడు', 'సారాయి వీర్రాజు'లో హీరోగానూ నటించాడు. అయితే అవి రెండూ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తాపడ్డాయి. దాంతో మళ్లీ విలన్‌ వేషాలపైనే దృష్టిపెట్టాడు.

అజయ్

అజయ్

"విక్రమార్కుడు"లో వీరలెవల్లో విలనిజం పండిచడమైనా, "ఆర్య 2″లో విలనిజంతో కామెడీని కలగలిపి నవ్వించడమైనా, "ఇష్క్" సినిమాలో నెగిటివ్ షేడ్ ఉన్న పాజిటివ్ బ్రదర్ క్యారెక్టర్ లో సెంటిమెంట్ పండించడం అయినా, ఇటీవల విడుదలైన "సుబ్రమణ్యం ఫర్ సేల్"లో చదువుకోని మాఫియా డాన్ గా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమైనా కేవలం అజయ్ కే సాధ్యపడింది.

అజయ్ భార్య శ్వేత రావూరి

అజయ్ భార్య శ్వేత రావూరి

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తున్న అజయ్‌ మళ్ళీ ఒక సారి వార్తల్లోకి వచ్చాడు. అయితే ఈ సారి ఆయన భార్య కారణంగా. అజయ్ భార్య శ్వేత రావూరి అందంతో పాటు ఫిట్ గా కూడా ఉంటుంది. అందుకే ఈ సారి జరుగుతున్నా మిసెస్ ఇండియా 2017 పోటీలో పోటీపడింది.

ఫైనల్ రౌండ్ చేరుకుంది

ఫైనల్ రౌండ్ చేరుకుంది

పోటీపడటమే కాకుండా ఫైనల్ రౌండ్ వరకు చేరుకుంది కూడాను. ఈ ఫలితాలు తెలియగానే అజయ్ భార్య శ్వేత క్షణం ఆలోచించకుండా సోషల్ మీడియాలో తన ఆనందాన్ని ఆమె స్నేహితులతో పంచుకుంది. తన భర్త సపోర్ట్ ఈ విజయంలో మరవలేనిది అని తెగ పొగిడేస్తోంది.

విజయానికి కారణం నా భర్తే

విజయానికి కారణం నా భర్తే

ఆమె ఫిట్నెస్ కోసం చాల కష్టపడింది అని చెబుతున్నారు ఆమె ఫ్రెండ్స్. పెళ్లి అయికా కూడా ఇలాంటి పోటీలుకు వెళ్ళి విజయం సాధించడం అంటే కొంచం ఇప్పుడు ఉన్న వాతావరణంలో కష్టమే అనే చెప్పాలి. నా విజయానికి కారణం మాత్రం నా భర్తే అని గర్వంగా చెబుతుంది శ్వేత.

2006లో పెళ్లి

2006లో పెళ్లి

అజయ్ శ్వేత పెళ్లి 2006లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారు కూడా మాంచి చిచ్చరపిడుగులే. ఫైనల్ లిస్ట్ లో శ్వేత ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి. ఒకవేళ మిస్సెస్ ఇండియా కిరీటంగెలిచే అవకాశాలూ ఉన్నాయి. గతంలో మరో తెలుగు మోడల్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి కూడా ఇలా గే మిసెస్ ఇండియా కెరీటం గెలుచుకున్న సంగతి చాలామందికి గుర్తుండే ఉంటుంది ఈసారి శ్వేత మళ్ళీ తెలుగు కి ఆ చాన్స్ ఇస్తుందనే అనుకుంటున్నారు.

English summary
Popular character artiste Ajay's wife Swetha Ravuri is an achiever now. The beautiful lady with a passion for fitness has made it to the final round of Haut Monde Mrs India Worldwide 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu