Don't Miss!
- News
UNION BUDGET 2023-2024: కేంద్ర బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ గంపెడాశలు; ఈసారైనా కేంద్రం కరుణిస్తుందా?
- Sports
INDvsNZ : మూడో టీ20లో తాడో పేడో.. సిరీస్ డిసైడర్లో వాతావరణం ఎలా ఉండబోతోంది?
- Finance
PMCares: PMCares రాజ్యాంగబద్ధమా ? RTI కిందకు వస్తుందా ? విరాళాల సంగతేంటి..??
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
రెండు వారాల్లో శుభవార్త.. వైఎస్ జగన్‌తో భేటీ తర్వాత.. కీలక పదవిపై హింట్ ఇచ్చిన ఆలీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రముఖ నటుడు ఆలీ సమావేశం విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ముగిసింది. నటుడు ఆలీకి కీలక పదవిని ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సానుకూలంగా ఉందనే వార్తలు, ఊహాగానాల మధ్య ఆలీ, సీఎం భేటి జరిగింది. ఈ క్రమంలోనే మంచు విష్ణు కూడా ఏపీ సీఎంతో భేటీ జరగడం మరింత ప్రాధాన్యం సంతరించుకొన్నది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అనంతరం ఆలీ మీడియాతో క్లుప్తంగా మాట్లాడుతూ..

అందుకే కలిశాను అంటూ..
తన భార్యతో కలిసి వైఎస్ జగన్‌ను కలిసిన తర్వాత ఆలీ మాట్లాడుతూ.. వైఎస్ కుటుంబంతో పరిచయం చాలా పాతది. మొన్న ఎన్నికల్లో కాదు.. పార్టీ పరిచయంతో సంబంధం లేకుండా మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం వైఎస్ జగన్‌ను కలిశాను. ఆ సందర్భంగా కొందరు సినీ సన్నిహితుల గురించి అడిగారు. అప్పుడు కలిసినప్పుడు సీఎం కాదు.. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అతడిని ప్రతీసారి కలువడానికి వీలు ఉండదు. ఆయన తన వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉంటారు. వందల మందిని కలుస్తుంటారు అని ఆలీ అన్నారు.

నా భార్యతో కలిసి వచ్చాను..
సినీ
ప్రముఖులతో
భేటీ
సందర్భంగా
వైఎస్
జగన్మోహన్
రెడ్డి
అపాయింట్‌మెంట్
అడిగాను.
వాళ్లు
నాలుగు
రోజులు
సమయం
తీసుకొని
అపాయింట్‌మెంట్
ఇచ్చారు.
నేను
నా
ఫ్యామిలీతో
వస్తున్నానని
చెబితే..
స్వాగతించారు.
అందుకే
నా
భార్యతో
కలిసి
వచ్చి..
సీఎం
జగన్
గారిని
కలుసుకొన్నాను.
మా
యోగ
క్షేమాలు
అడిగి
తెలుసుకొన్నాను
అని
ఆలీ
చెప్పారు.

నా పెళ్లి రోజున కలుద్దామని..
ఏపీ
ముఖ్యమంత్రి
వైఎస్
జగన్మోహన్
రెడ్డి
అంటే
నా
భార్యకు
చెప్పలేనంత
అభిమానం.
మా
పెళ్లి
రోజు
వచ్చి
కలుద్దామని
అనుకొన్నాను.
కానీ
వీలు
పడలేదు.
ఇప్పుడు
నా
భార్యతో
కలిసి
వచ్చి
కలిశాను.
నా
భార్యకు
ఎప్పుటి
నుంచి
వైఎస్
జగన్‌తో
ఫోటో
దిగాలని
ఉంది.
ఇప్పుడు
ఆ
కోరిక
తీరింది
ఆలీ
చెప్పారు.

గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.. కానీ
గత అసెంబ్లీ ఎన్నికల్లో నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పారు. కానీ నాకు సమయం లేకపోవడంతో టికెట్ నిరాకరించాను. ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే.. క్షేత్రస్థాయి నుంచి పనిచేయాలి. నా ఫేస్ వ్యాల్యూ చూసి ఓటు వేస్తారనుకొంటే తప్పు. నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకొంటే తప్ప.. ఎన్నికల్లో పోటీ చేయలేం. అందుకే వద్దని అనుకొన్నాను అని ఆలీ చెప్పారు.

ఏపీలో టికెట్ రేట్ల వివాదంపై
సీఎంతో భేటి సందర్భంగా సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చించాం. తెలంగాణలో సినీ పరిశ్రమకు లేని కష్టాలు ఏపీలో ఎందుకు ఉన్నాయంటే.. సగటు ప్రేక్షకుడికి టికెట్ ధర అందుబాటులో ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఏపీలో కావాలని చేసినవి కాదు. చిన్న సినిమాకు కూడా లాభం ఉండాలనే యోజనలో ప్రభుత్వం ఉంది. అటు చిన్న సినిమాకు, పెద్ద సినిమాకు లాభం చేకూరుతుంది అని అన్నారు.
Recommended Video

రెండు వారాల్లో శుభవార్త అంటూ
సినిమా పరిశ్రమలోను, రాజకీయ రంగంలో కూడా నాది సుదీర్ఘ ప్రయాణం. ఇండస్ట్రీలో 40 ఏళ్లకుపైగా జర్నీ. రాజకీయాల్లో 20 ఏళ్లకుపైగా ప్రయాణం. వైసీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో అండగా నిలిచిన ఆలీ అసంతృప్తిలో ఉన్నాడని తెలుసుకొన్న తర్వాత ఏపీ ప్రభుత్వం తనను ఆహ్వానించిందనే వార్తల్లో వాస్తవం లేదు. రెండు వారాల్లోనే మీకు మంచి వార్త తెలుస్తుంది. నా కంటే మీకే ఆ వార్త ముందు తెలియడం ఖాయం. అంతవరకు వేచి ఉండండి అని తెలిపారు. దీంతో కీలక పదవి తనకు లభించబోతుందనే పరోక్షంగా ఆలీ సంకేతాలు ఇచ్చారు.