»   » కళాతపస్వికి అల్లు అర్జున్, మంత్రి తలసాని అభినందనలు..

కళాతపస్వికి అల్లు అర్జున్, మంత్రి తలసాని అభినందనలు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారతీయ సినిమా పరిశ్రమలో నోబెల్‌ పురస్కారంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన ప్రముఖ దర్శకుడు కే విశ్వనాథ్‌ను పలువురు సినీ ప్రముఖులు బుధవారం కలిశారు. విశ్వనాథ్‌ను కలిసిన వారిలో రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీ నటుడు అల్లు అర్జున్ ఉన్నారు. గత రెండు రోజుల క్రితం విశ్వనాథ్‌కు కేంద్ర ప్రభుత్వం ఫాల్కే అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆత్మీయ పలకరింపు

ఆత్మీయ పలకరింపు

ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని అల్లు అర్జున్ బుధవారం విశ్వనాథ్‌ను ఆత్మీయంగా పలుకరించారు. కళాతపస్వి నివాసానికి వెళ్లి అల్లు అర్జున్ కాసేపు గడిపారు. ఫాల్కే అవార్డు వచ్చినందుకు అభినందలు తెలిపారు. ఆయన యోగక్షేమాలను తెలుసుకొని కుటుంబ సభ్యులను పలకరించారు.

కళాతపస్విని కలిసిన మంత్రి తలసాని

కళాతపస్విని కలిసిన మంత్రి తలసాని

ప్రతిష్టాత్మక ఫాల్కే అవార్డుకు ఎంపికైన కే విశ్వనాథ్‌ను మంత్రి తలసాని అభినందించారు. దర్శక దిగ్గజం నివాసానికి వెళ్లి శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున అభినందనలు తెలిపారు.

మెగాస్టార్, పవర్‌స్టార్ అభినందన

మెగాస్టార్, పవర్‌స్టార్ అభినందన

ఫాల్కే అవార్డు వచ్చిన నేపథ్యంలో విశ్వనాథ్‌ను మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలుసుకొన్నారు. విశ్వనాథ్‌కు అవార్డు రావడం ఫాల్కే పురస్కారానికి నిండుతనం వచ్చిందని మెగాస్టార్ అన్న విషయం తెలిసిందే.

మే 3న పురస్కార ప్రదానం

మే 3న పురస్కార ప్రదానం

దర్శక దిగ్గజం విశ్వనాథ్‌కు కేంద్ర ప్రభుత్వం మే 3 తేదీన అవార్డును అందజేయనున్నారు. అవార్డు కింద 10 లక్షల నగదు, స్వర్ణ పతకం, శాలువాతో సత్కరించారు.

English summary
Actor Allu Arjun, Minister Talasani Srinvas met Phalke awardee K Vishwanath, They congratulates Kalatapasvi for Winning prestigious Dada Saheb Phalke Award.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu