twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీను వైట్లకు షాకిచ్చి.. బోయపాటికి బన్నీ గ్రీన్ సిగ్నల్...

    By Rajababu
    |

    విజయం అందనంత ఎత్తుకు తీసుకెళ్తుంది. పరాజయం అధోపాతాళానికి తొక్కేస్తుంది అనేది అందరికీ తెలిసిందే. సినీ పరిశ్రమలో సక్సెస్‌కే పెద్ద పీట ఉంటుంది. సక్సెస్ జోరు కొనసాగినప్పుడు ఎవరైనా జోడి కట్టడానికి సిద్ధమవుతారు. అదే ఒక ఫెయిల్యూర్ అందిస్తే హీరోకైనా, దర్శకుడికైనా పరిస్థితి దారుణంగా ఉంటుంది. దూకుడు, బాద్షా లాంటి వరుస హిట్లతో టాప్ గేర్‌లో దూసుకెళ్లిన శ్రీను వైట్ల ఆగడు, బ్రూస్‌లీ చిత్రాల పరాజయం తర్వాత ప్రస్తుతం కొంత ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం మిస్టర్ చిత్రంతో తన పూర్వ వైభవాన్ని పొందేందుకు సిద్ధమయ్యాడు

    అల్లు అర్జున్ కోసం మిస్టర్ కథ..

    అల్లు అర్జున్ కోసం మిస్టర్ కథ..

    ఆగడు, బ్రూస్‌లీ చిత్రాల తర్వాత అల్లు అర్జున్‌ను దృష్టిలో పెట్టుకొని శ్రీను వైట్ల కథ రాసుకొన్నాడట. ఆ తర్వాత స్టైలిష్ స్టార్‌కు వినిపించగా ఆయనకు తెగ నచ్చేసింది కూడా. ఆ సమయంలో బోయపాటి చెప్పిన కథతో అల్లు అర్జున్ సరైనోడు చేయాల్సి వచ్చింది.

    మిస్టర్‌ను వదిలేసి సరైనోడు..

    మిస్టర్‌ను వదిలేసి సరైనోడు..

    అయితే అల్లు అర్జున్ ఎంపిక సరైనదేనని సరైనోడు సినిమా రుజువు చేసింది. బన్నీ కెరీర్‌లోనే అతి పెద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత బన్నీ ఆసక్తి చూపకపోవడంతో అదే కథను మిస్టర్‌గా వరుణ్ తేజ్‌కు వినిపించాడు. దాంతో వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ కథ మిస్టర్‌గా రూపుదిద్దుకొన్నది.

    మిస్టర్ చేయకపోవడానికి..

    మిస్టర్ చేయకపోవడానికి..

    లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా మిస్టర్ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్ర విడుదలను పురస్కరించుకొని శ్రీనువైట్ల మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ విషయాన్ని వెల్లడించారు. ఇదే కథతో బన్ని సినిమా చేయకపోవడానికి కారణాలను తెలియజేశాడు.

    బన్నీ కథను పక్కన పెట్టి..

    బన్నీ కథను పక్కన పెట్టి..

    మిస్టర్ కథతో బన్నీ సినిమా చేయకపోవడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి అట. ఆ చిత్రం క్లాస్ మూవీగా పేరు తెచ్చుకొన్నది. వరుసగా రెండు క్లాస్ చిత్రాలను చేయడం ఇష్టం లేక మిస్టర్ కథను పక్కనపెట్టాడని శ్రీను వైట్ల పేర్కొన్నారు.

    భారీ హిట్‌పై ఆశలు..

    భారీ హిట్‌పై ఆశలు..

    బన్నీ సినిమా చేయలేని పరిస్థితిలో మిస్టర్ సినిమా చేసేందుకు వరుణ్‌ ముందుకు వచ్చాడట. కెరీర్ పరంగా ప్రస్తుతం శ్రీను వైట్లకు, వరుణ్ తేజ్‌కు మాస్ హిట్ చాలా అవసరం. ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందింతే ఇద్దరి ఖాతాలో పెద్ద హిట్ చేరే అవకాశాలను కొట్టిపారేయలేం. మిస్టర్ చిత్రం ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమవుతున్నది.

    English summary
    Director Srinu Vaitla's Mister move geared up to release on April 14th. He shares some experiences with mister movie. He first writes this story for Allu Arjun. but Bunny rejected Srinu Vaitla proposal and take Boyapati Srinu for other reasons.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X