»   » అమితాబ్ గురించి షాకింగ్ న్యూస్.. అద్భుతం.. ఎంటో తెలుసా?

అమితాబ్ గురించి షాకింగ్ న్యూస్.. అద్భుతం.. ఎంటో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

వెండితెర మీద కనిపించాలన్న కోరికతో స్టార్‌గా ఎన్నో ఆశలను మూటగట్టుకొని వస్తారు. కానీ ఆ అదృష్టం కొందరినే వరిస్తుంది. అలాంటి వారిలో బిగ్ బీ అమితాబ్ ఒకరు. తొలుత పరిశ్రమలో చీత్కారానికి గురై దేశం గర్వించే దగ్గ నటుడి స్థాయిని దక్కించుకొన్నారు. అలాంటి అమితాబ్‌కు ఫిబ్రవరి 15వ తేదీ చిరస్మరణీయమైన రోజు. ఆశలకు తుదిరూపం కల్పించిన మధురమైన జాపకం.

 ఫిబ్రవరి 15న బాలీవుడ్‌ తెరపైకి

ఫిబ్రవరి 15న బాలీవుడ్‌ తెరపైకి


‘1969 ఫిబ్రవరి 15వ తేదీన సినీ పరిశ్రమలోకి అధికారికంగా అడుగుపెట్టాను. నా తొలి చిత్రం సాత్ హిందూస్థాన్ చిత్రం కోసం సంతకం చేశాను. అప్పటి నుంచి సినీ జీవితంలో వెనుకకు చూసిన దాఖలాలు లేవు. ఏ అబ్బాస్ నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించారు' అని అమితాబ్ బుధవారం ట్వీట్ చేశారు. ఆ నాటి మధుర సృతులను మళ్లీ గుర్తు చేసుకొన్నారు.

 అగ్నిపథ్‌ చిత్రానికి 27 ఏండ్లు

అగ్నిపథ్‌ చిత్రానికి 27 ఏండ్లు


తెరపై విజయ్ ధీనానాథ్ చౌహాన్ అంటూ గర్జించడానికి అవకాశం కల్పించిన అగ్నిపథ్ (1990) చిత్రానికి ఫిబ్రవరి 16వ తేదీతో 27 ఏండ్లు పూర్తయ్యాయి. అలాగే ఆయన నటించిన బందే హాత్ (1973) చిత్రం 44 ఏండ్లు పూర్తి చేసుకొన్నది. అలాగే ఏకలవ్య, ది రాయల్ గార్డ్ (2007) చిత్రానికి 10 ఏండ్లు పూర్తి చేసుకున్నది అని అమితాబ్ గురువారం ట్వీట్ చేశారు.

ట్విట్టర్‌లో బిగ్ బీ 2.5 కోట్ల ఫాలోవర్స్

ట్విట్టర్‌లో బిగ్ బీ 2.5 కోట్ల ఫాలోవర్స్

సినీ పరిశ్రమలో చోటుచేసుకొంటున్న మార్పులు, ప్రేక్షకుల అభిరుచులను ఎప్పటికప్పుడు గమనిస్తూ తనకు తాను గొప్ప నటుడిగా రూపొందారు. అమితాబ్ జోరు కేవలం సినీ పరిశ్రమకే పరిమితం కాలేదు. రాజకీయ రంగంలో తడాఖా చూపించారు. తాజాగా ప్రజల జీవితంలో ప్రధాన భాగమైన సోషల్ మీడియాలోనూ జోరు సాగిస్తున్నారు. ట్విట్టర్‌లోని ఆయన ఖాతాను ఫాలో చేస్తున్న నెటిజన్ల సంఖ్య 2.5 కోట్లకు (25 మిలియన్లకు) చేరుకోవడం గమనార్హం.

 యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా అగ్రస్థానానికి

యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా అగ్రస్థానానికి


బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలను షోషిస్తూ అగ్రనటుడిగా గుర్తింపుపొందారు. 70, 80 దశకాల్లో దీవార్, జంజీర్ లాంటి చిత్రాల్లో నటించి యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరు పొందారు. సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 1984లో బిగ్ బీకి పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2015లో పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. 74 ఏండ్ల వయసులో కూడా ఇప్పటికి యువ హీరోలకు దీటుగా పాత్రలను షోషిస్తున్నారు. పీకూ, పింక్ లాంటి చిత్రాలు ఆయన ప్రతిష్ఠను మరింత పెంచాయి.

English summary
Amitabh Bachchan's got his first ever break in Indian cinema in K Abbas's movie "Saat Hindustani"in 1969. Till then now he never looked back in the bollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu