»   » రికార్డు ధరకు బాలయ్య సినిమా హక్కులు.. పరిశీలనలో అదే టైటిల్ అట.

రికార్డు ధరకు బాలయ్య సినిమా హక్కులు.. పరిశీలనలో అదే టైటిల్ అట.

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటసింహం నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న క్రేజీ ప్రాజెక్ట్‌ గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వస్తున్నది. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ చానెల్ భారీ మొత్తం చెల్లించి దక్కించుకొన్నట్టు వార్త సినీ వర్గాల్లో ప్రచారమవుతున్నాయి. బాలకృష్ణ కెరీర్‌లో 101వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వీ ఆనంద్‌ప్ర‌సాద్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీయా సరన్, ముస్కాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

జెమినీ టెలివిజన్‌కు..

జెమినీ టెలివిజన్‌కు..

తాజా సమాచారం ప్రకారం ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం హక్కులను జెమినీ టెలివిజన్ సొంతం చేసుకొన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. హక్కుల కోసం భారీ మొత్తాన్ని ముట్టుజెప్పినట్టు తెలుస్తున్నది. మీడియాలో వార్తలు వెలువడిని వివరాల ప్రకారం దాదాపు రూ.9 కోట్లు చెల్లించి హక్కులను జెమినీ టెలివిజన్ దక్కించుకొన్నట్టు తెలుస్తున్నది.

పోర్చుగల్‌కు తదుపరి షెడ్యూల్ కోసం..

పోర్చుగల్‌కు తదుపరి షెడ్యూల్ కోసం..

బాలకృష్ణ తాజా చిత్రం షూటింగ్ మార్చి రెండోవారం నుంచి హైదరాబాద్‌లో ఏకధాటిగా జరుపుకొన్నది. తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ పోర్చుగల్‌కు ప్రయాణమైంది. ఈ చిత్రానికి కీలక నేపథ్యమున్న సన్నివేశాలను సుమారు 40 రోజులపాటు చిత్రీకరించనున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ మే 10న పోర్చుగల్‌కు ప్రయాణమైనట్టు తెలిసింది.

గ్యాంగ్‌స్టర్‌గా

గ్యాంగ్‌స్టర్‌గా

పూరి జగన్నాథ్ స్టయిల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కూడా గ్యాంగ్‌స్టర్ అనే పేరు పెట్టాలనే ప్రతిపాదన కూడా వచ్చినట్టు తెలిసింది. అనుకున్న ప్లానింగ్ ప్రకారం షూటింగ్‌ను పూర్తి చేసుకొని దసరా కానుకగా సెప్టెంబర్ 29న విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

నాలుగోసారి శ్రీయ

నాలుగోసారి శ్రీయ

బాలకృష్ణ సరసన అందాల తార శ్రీయ సరన్ నటించడం ఇది మూడోసారి. గతంలో చెన్నకేశవరెడ్డి, ఇటీవల గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో ఆమె నటించింది. శాతకర్ణి సినిమా అనంతరం బాలకృష్ణ మళ్లీ శ్రీయకే ఛాన్స్ ఇవ్వడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. శాతకర్ణిలో శ్రీయ వశిష్టిదేవిగా నటించి విమర్శల ప్రశంసలు అందుకొన్న సంగతి తెలిసిందే.

English summary
Actor Balakrishna, Director Balakrishna movie shooting shifted to portugal. Shoooting may happen for 40 days. As per reports, This movie satellite rights sold for Rs. 9 crores.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu