Don't Miss!
- News
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేదెవరు - తేల్చేసిన జాతీయ సర్వే...!!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం సరైన ఫ్రెండ్ను కనిపెట్టడం ఎలాగంటే..
- Finance
Adani Shares: అదానీపై రిపోర్టు విశ్వసనీయమైనదే.. నోరు విప్పిన బిలియనీర్ ఇన్వెస్టర్
- Sports
INDvsNZ : అది అంత ఈజీ కాదు.. అతన్ని తొలి టీ20 ఆడించాలన్న మాజీ లెజెండ్!
- Automobiles
బుల్లితెర నటి 'శ్రీవాణి' కొన్న కొత్త కారు, ఇదే: చూసారా..?
- Technology
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
చలపతిరావు అంత్యక్రియలు పూర్తి.. భోరుమని విలపించిన రవిబాబు!
ప్రముఖ నటుడు, నిర్మాత చలపతి రావు ఆకస్మిక మరణం అభిమానులను, సినీ వర్గాలను దిగ్బ్రాంతికి గురి చేసింది. డిసెంబర్ 24వ తేదీ రాత్రి 8 గంటలప్రాంతంలో చలపతిరావు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కుమార్తెలు అమెరికాలో ఉండటం.. ఈ విషాద వార్త తెలిసి అక్కడి నుంచి రావడం ఆలస్యం కావడంతో చలపతిరావు అంత్యక్రియలను బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు ఆయనకు కన్నీటితో తుది వీడ్కోలు తెలిపారు.
చలపతిరావు కుమార్తెలిద్దరూ అమెరికా నుంచి మంగళవారం ఉదయం చేరుకొన్నారు. అయితే మంగళవారం అంత్యక్రియలు నిర్వహించడం మంచి కాదనే ఉద్దేశంతో బుధవారం నిర్వహించారు. అయితే మహాప్రస్థానంలో జరిగిన అంత్య్రక్రియలను కుమారుడు, నటుడు, దర్శకుడు రవిబాబు నిర్వహించారు. పండితుల వేద మంత్రాల నడుమ, ఉబికి వస్తున్న దు:ఖాన్ని దిగమింగుతూ రవిబాబు అంత్య్రియలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. ఓ దశలో రవిబాబు దు:ఖాన్ని ఆపుకోలేక భోరుమని విలపించారు. ఆయన దు:ఖాన్ని ఆపడం ఎవరితరం కాలేదు. అలా విషాదవదనంతో తన తండ్రి అంత్యక్రియలను పూర్తి చేశారు.

చలపతి రావు వ్యక్తిగత జీవితానికి వస్తే.. నటుడు, నిర్మాత చలపతిరావు గత 6 దశాబ్దాల సినీ జీవితంలో 1200కిపైగా చిత్రాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్య నటుడిగా పలు పాత్రలు పోషించారు. 1966 సంవత్సరంలో గూడఛారి 116 సినిమాతో చలపతిరావు సినీ రంగంలోకి ప్రవేశించారు. ఇప్పటి వరకు ఆయన 1200 చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన చివరి చిత్రం బంగార్రాజు. నిర్మాతగా కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట, ప్రసిడెంట్ గారి అల్లుడు, అర్ధరాత్రి హత్యలు, రక్తం చిందిన రాత్రి సినిమాలను నిర్మించారు.