Just In
- 1 min ago
అలాంటి సమయంలో పర్సనల్‌గా ఫోన్.. నరేష్‌పై పవిత్రా లోకేష్ కామెంట్స్
- 58 min ago
అది మాత్రం కంపల్సరీ అంటూ... గోవాలో రాశీ ఖన్నా రచ్చ
- 1 hr ago
మరో నిర్మాత కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప తరువాత అదే..
- 1 hr ago
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
Don't Miss!
- Finance
IMF చీఫ్ గీతా గోపినాథ్‌పై అమితాబ్ వ్యాఖ్యలు, ఏం మాటలు అంటూ నెటిజన్ల అసహనం
- News
ఎస్సై ఆత్మహత్యను రాజకీయంగా వాడుకుంటారా ? చంద్రబాబు, దేవినేని ఉమపై పోలీస్ అధికారుల సంఘం ధ్వజం
- Sports
IPL 2021: చెన్నై జట్టులోకి రాబిన్ ఊతప్ప.. మీరు మారరంటూ ఫ్యాన్స్ ఫైర్!
- Automobiles
భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫోటోలు : నటుడు మణివన్నన్ అంత్యక్రియలు
చెన్నై : ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు మణివన్నన్ శనివారం చెన్నైలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన భౌతిక దేహానికి అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. తమిళ చిత్రసీమకు సంబంధించిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరైన అంతిమ వీడ్కోలు పలికారు.
ప్రముఖ తమిళ నటులు సత్యరాజ్, నాజర్, సంగీత దర్శకుడు : ఇళయరాజా, హీరో విజయ్, దర్శకుడు సి. సుందర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మణివన్నన్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మణివన్నన్‌కు సన్నిహితుడైన నటుడు సత్యరాజ్ ఈ సందర్భంగా ఉద్వేగానికి గురయ్యారు.
59 ఏళ్ల మణివన్నన్ శనివారం గుండెపోటుతో మరణించారు. దాదాపు 400లకు పైగా చిత్రాల్లో నటుడిగా, 50కిపైగా చిత్రాలకు దర్శకుడిగా పని చేసిన మణివన్నన్ సీనియర్ తమిళ సినీ ప్రముఖుల్లో ఒకరు. మణివన్నన్ దర్శకత్వంలో చివరగా సత్యరాజ్ ప్రధాన పాత్రలో 'నాగరాజ చోలన్ ఎంఏ, ఎంఎల్ఏ' అనే తమిళ చిత్రం విడుదలైంది. మే 10, 2013లో విడుదలైన ఈ చిత్రంలో ఆయన ఓ పాత్ర కూడా పోషించారు.

మణివన్నన్ కుమారుడు రఘువన్ననన్‌ను ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. ఇతను కూడా నటుడే. ఆయన చివరగా తన తండ్రి దర్శకత్వంలో రూపొందిన ‘నాగరాజ చోళన్ ఎంఏ, ఎంఎల్ఏ' చిత్రంలో నటించారు. రఘువన్నన్ హీరోగా మరో సినిమాకు సైన్ చేసాడు. మణి వన్నన్ కూతురు పేరు జ్యోతి.

400లకు పైగా చిత్రాల్లో నటించిన మణివన్నన్, 50పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. తమిళ సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులందరితోనూ ఆయనకు మంచి అనుబంధం ఉంది.

మనివన్నన్ మరణ వార్త వినగానే తమిళ హీరో విజయ్ షాకయ్యారు. అదే విధంగా ప్రియమణి, ఇతర నటీనటులు కూడా ఆయన మరణివార్తను జీర్ణించుకోలేక పోయారు.

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మణివన్నన్ భౌతిక కాయాన్ని దర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

మణివన్నన్, నాజర్ కలిసి అనేక చిత్రాల్లో కలిసి నటించారు. అదే విధంగా మణివన్నన్ దర్శకత్వంలో వచ్చిన పలు చిత్రాల్లోకూడా నాజర్ నటించారు.

దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సి.సుందర్ గతంలో మణివన్నన్ వద్ద అసిస్టెంట్ గా పని చేసారు.

మణివన్నన్ ఆత్మకు శాంతి కలుగాలని తమిళ సినీ ప్రముఖుడు చేరన్ ప్రార్థన

మణివన్నన్ దర్శకత్వంలో సత్యరాజ్ దాదాపు 20 చిత్రాల్లో నటించారు. చివరగా వీరి కాంబినేషన్లో ఈ సంవత్సరం ‘నాగరాజ చోలన్, ఎంఏ, ఎమ్మెల్యే' చిత్రం విడుదలైంది.

మణివన్నన్ మరణం తమిళ సినీ పరిశ్రమకు తీరని లోటని పలువురు ప్రముఖులు వ్యాఖ్యానించారు.

మణివన్నన్ మరణంతో సత్యరాజ్ బాగా అప్ సెట్ అయ్యారు. అంత బాధలోనూ మణివన్నన్ కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేసారు