twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    60వ పుట్టిన రోజు: జగపతి బాబు కీలక ప్రకటన.. టాలీవుడ్ లో ఆ అతి కొద్దిమంది సరసన!

    |

    ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా చాలా సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు ఆ తరువాత విలన్ పాత్రలకు పరిమితం అయ్యారు. ప్రస్తుతం ఆయన విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే తన అరవయ్యవ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

    లెజెండ్ తో రీ ఎంట్రీ

    లెజెండ్ తో రీ ఎంట్రీ

    ఫ్యామిలీ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు హీరోగా ఫేడ్ అవుట్ అయిపోవడంతో అవకాశాలు దొరకని పరిస్థితుల్లో బోయపాటి శ్రీను లెజెండ్ సినిమాలో విలన్ పాత్ర ఇవ్వడంతో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆ తరువాత ఆయన మళ్ళీ వెనక్కు తిరిగి చూసుకునే పని పడలేదు. అయితే తన అరవయ్యవ పుట్టినరోజు సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు.

    ముఖ్య అతిథిగా

    ముఖ్య అతిథిగా

    సినీ సెలబ్రిటీ అయినా సరే జగపతి బాబు చాలా సింపుల్ గా తన లైఫ్ లీడ్ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు అందులో భాగంగానే యోగ వంటి విషయాల్లో కూడా చాలా యాక్టివ్ గా చూపిస్తుంటారు. ఫిబ్రవరి 12వ తేదీ జగపతి బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక కీలక ప్రకటన చేయడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవయవ దానం అవగాహన కార్యక్రమంలో నటుడు జగపతి బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    60వ పుట్టినరోజు సందర్భంగా

    60వ పుట్టినరోజు సందర్భంగా


    ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జగపతి బాబు సినిమాలో హీరో అనిపించుకోవడం కంటే నిజజీవితంలో హీరో అనిపించుకోవాలి అనే ఉద్దేశంతో అవయవ దానం చేయడానికి సిద్ధమయ్యానని ఆయన వెల్లడించారు. తన 60వ పుట్టినరోజు సందర్భంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నానని ఆయన వెల్లడించారు. మనుషులుగా పుడతాం, మనుషులుగా చనిపోతాము, వెళ్ళేటప్పుడు 200 గ్రాములు బూడిద తప్ప ఇంకేమీ మిగలదని ఆయన వెల్లడించారు.

    ఎవరెవరు చేశారు అంటే?

    ఎవరెవరు చేశారు అంటే?


    కానీ అవయవ దానం అనేది చేయడం కారణంగా మనం మరణించిన తర్వాత ఏడు ఎనిమిది మందికి పునర్జన్మ ఇచ్చే అవకాశం కలుగుతుందని జగపతి బాబు ఈ సందర్భంగా వెల్లడించారు. అంతేకాక అవయవ దానం చేసే వాళ్ళకి పద్మశ్రీ పద్మభూషణ్ ఇలాంటి అవార్డులు కూడా ప్రదానం చేయాలని ఆయన అన్నారు. ఒకరకంగా టాలీవుడ్ కు సంబంధించి ఇలా అవయవ దానం చేసిన అతి కొద్దిమంటి నటులలో ఆయన కూడా చేరారు. టాలీవుడ్ లో జగపతిబాబు మాత్రమే కాక హీరో నవదీప్, హీరోయిన్ సమంత, దర్శకుడు రాజమౌళి కూడా తన మరణానంతరం తన అవయవాలు దానం చేయాలని అవయవదానం కార్యక్రమంలో చేరారు.

    Recommended Video

    Jagapathi Babu Makes Fun Of His monotonous Roles | Hero Movie | Ashok Galla | Filmibeat Telugu
     అవయవ దానం మీద

    అవయవ దానం మీద


    గతంలో అవయవ దానం మీద అవగాహన ఉండేది కాదు కానీ ఈ మధ్య కాలంలో అవయవ దానం మీద అవగాహన పెరుగుతుంది జగపతి బాబు లాంటి నటులు ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనే మరి కొంత మందికి అవగాహన పెరిగి దురదృష్టవశాత్తు లేక సాధారణంగానో చనిపోయిన తర్వాత వారి భౌతిక దేహంతో ఏడు ఎనిమిది మందికి పునర్జన్మ ఇచ్చే అవకాశం పొందవచ్చు.

    English summary
    Actor Jagapathi Babu takes pledge for organ donation on his 60th birthday
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X