twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రూ. 1.50 కోట్ల చెక్కు అందించిన సూపర్ స్టార్ కృష్ణ

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హుధూద్ తుఫాన్ బాధితుల కోసం సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం రూ. 50 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా కృష్ణ అల్లుడు, గుంటూరు లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ రూ.కోటి విరాళం అందించారు. ఈ మొత్తాన్ని ఒకే చెక్కు రూపంలోకి మార్చి రూ.1.50 కోట్ల చెక్కును ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబును కలిసి అందజేసారు. కృష్ణ వెంట ఆయన భార్య విజయనిర్మల కూడా ఉన్నారు. మహేష్ బాబు షూటింగులో భాగంగా హాంకాంగ్ లో ఉన్నందున రాలేదని కృష్ణ తెలిపారు.

    హుధూద్ తుఫాన్ కోసం....కృష్ణ కుటుంబంతో పాటు ఇతర టాలీవుడ్ ప్రముఖులు కూడా విరాళాలు అందజేసారు. పవన్ కళ్యాణ్ రూ. 50 లక్షలు, రామానాయుడు ఫ్యామిలీ రూ. 50 లక్షలు, కృష్ణ మహేష్ ఫ్యామిలీ రూ. 50 లక్షలు, తమిళ హీరోలైన సూర్య, కార్తి ఫ్యామి రూ. 50 లక్షలు, అల్లు అర్జున్ రూ. 25 లక్షలు, ప్రభాస్, ఎన్టీఆర్, నాగార్జున, రేణు దేశాయ్ రూ. 20 లక్షల చొప్పున, రామ్ చరణ్ 15 లక్షలు, నితిన్,రామ్, రవితేజ, సమంత లాంటి వారు 10 లక్షల చొప్పున. ఇలా టాలీవుడ్ కు చెందిన ప్రముఖులంతా తమకు తోచిన విధంగా తుఫాన్ బాధితుల కోసం విరాళాలు అందించారు.

    Actor Krishna meets AP CM Chandrababu

    హుధూద్ తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో భాగంగా నిధుల సేకరణకోసం టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ నటులు శ్రీకాంత్, తరుణ్, శివాజీ తెలిపారు. ఈ మ్యాచ్ నిర్వహణ ద్వారా వచ్చే ఆధాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కోసం విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియజేయనున్నట్లు తెలిపారు.

    ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల్లో ఈ నెల 12న తీరం దాటిన హుధూద్ తుఫాన్ ఆయా జిల్లాల్లో తీవ్ర నష్టం కలిగించింది. పంటలకు తీవ్రంగా నష్టం కలిగించడంతో పాటు విత్యుత్, రవాణా, మంచినీరు, ఆహారం సరఫరా లాంటివి నిలిచి పోయాయి. వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుంది.

    English summary
    Actor Krishna meets AP CM Chandrababu today. Krishna gave a cheque of rs 1.5 crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X