»   » మాధవన్ కొడుకు దుమ్మురేపాడు.. ఊహించలేదు.. గ్రేట్

మాధవన్ కొడుకు దుమ్మురేపాడు.. ఊహించలేదు.. గ్రేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పుత్ర రత్నాలు ఎదైనా ఘన కార్యాన్ని సాధిస్తే తండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. తాజాగా అలాంటి క్షణాలనే విలక్షణ నటుడు మాధవన్ అనుభవిస్తున్నాడు. తన కుమారుడు వేదాంత్ ఈత పోటీలలో 4 కిలో మీటర్ల దూరాన్ని కేవలం 57 నిమిషాల్లోనే ఈదడం ద్వారా ఓ రికార్డును సొంతం చేసుకొన్నాడు. తన కొడుకు సాధించిన విజయంపై మాధవన్ ట్విట్టర్‌లో సంతోషాన్ని వ్యక్తం చేశారు.

తండ్రిగా గర్వపడే క్షణాలివి

తండ్రిగా గర్వపడే క్షణాలివి. వేదాంత్ ఈత పోటీలలో భాగంగా నాలుగు కిలోమీటర్ల దూరాన్ని కేవలం 57 నిమిషాల్లోనే ఈదాడు. అసలు వేదాంత్‌లో ఇంత ప్రతిభ ఉందని ఊహించలేదు. నమ్మలేకపోతున్నాను అని ఇద్దరు కలిసి ఉన్న ఫొటోను మాధవన్ ట్వీట్ చేశారు.

విక్రమ్ వేదలో.. చందమామ దూర్

విక్రమ్ వేదలో.. చందమామ దూర్

హిందీలో త్రీ ఇడియెట్స్ లాంటి చిత్రంలో నచించిన మాధవన్ తాజాగా సాలా ఖడూస్ అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రం తెలుగులో గురుగా రీమేక్ అవుతున్నది. ప్రస్తుతం విక్రమ్ వేద అనే తమిళ చిత్రంలోనూ, చందమామ దూర్ కే అనే హిందీ చిత్రంలో నటిస్తున్నాడు.

హార్వర్డ్ లో అరుదైన గౌరవం

హార్వర్డ్ లో అరుదైన గౌరవం

ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి అమెరికాలో పర్యటించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఇండియా కాన్ఫరెన్స్‌లోనూ పాల్గొన్నాడు. భారతీయ నటుల్లో పవన్, మాధవన్‌లకు అరుదైన అవకాశం దొరికిన సంగతి తెలిసిందే.

హార్వర్డ్‌లో మాట్లాడటం గొప్ప గౌరవం

హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన సదస్సులో తనకు లభించిన గౌరవంపై మాధవన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నాపై నిర్వాహకులు చూపిన ఆదరణ, వారు ఇచ్చిన ఆతిథ్యం చాలా గొప్పగా ఉన్నాయి అని ఇటీవల మాధవన్ ట్వీట్ చేశారు. పరిణతితో కూడిన ప్రసంగం చేయడం చాలా గర్వంగా ఉందని, హార్వర్డ్ వర్సిటీలో మాట్లాడటం గొప్ప అవకాశం అని మాధవన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

English summary
Actor Madhvan said, Proud day for the Dad in Me.Vedaant swam 4 km Swimathon in under 57 min. Something I can NEVER imagine doing.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X