»   » నాగార్జునకు మళ్లీ తీవ్ర మనస్తాపం... చైతూ కోసం స్వయంగా రంగంలోకి..

నాగార్జునకు మళ్లీ తీవ్ర మనస్తాపం... చైతూ కోసం స్వయంగా రంగంలోకి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున అక్కినేని తన సినిమాలపైనే కాకుండా తన కుమారులు నాగచైతన్య, అఖిల్ అక్కినేని కెరీర్‌పైనా కేంద్రీకరించారు. ఊపిరి, సోగ్గాడే చిన్నినాయనా, ఓం నమో వెంకటేశాయా లాంటి వరుస హిట్లను పరిశ్రమకు అందించాడు. విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకొంటూ ప్రేక్షకులను అలరిస్తున్న నాగార్జున ప్రస్తుతం రాజుగారి గది2లో తన ఇమేజ్‌కు భిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. అంతేకాకుండా నాగచైతన్య నటిస్తున్న రారండోయ్ వేడుక చూద్దాం సినిమాపై ద‌ృష్టిపెట్టారు. అయితే ఈ సినిమా అవుట్‌పుట్‌పై ఇటీవల నాగార్జున తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం.

ఆలస్యంపై ఆగ్రహం..

ఆలస్యంపై ఆగ్రహం..

రారండోయ్ వేడుక చూద్దాం సినిమాను స్వయంగా అన్నపూర్ణ బ్యానర్‌పై నాగార్జున నిర్మిస్తున్నారు. సోగ్గాడే చిన్నినాయన లాంటి సూపర్‌హిట్‌ను అందించిన కల్యాణ్ క‌ృష్ణ చేతిలో ఈ ప్రాజెక్ట్‌ను పెట్టాడు. సినిమా ఆలస్యం కావడంపై అసహనానికి గురయ్యారట. ఈ సినిమా అవుట్‌పుట్ చూసిన నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారనేది ఫిలింనగర్ సమాచారం.

క్లాసిక్‌గా మలుచాలనే..

క్లాసిక్‌గా మలుచాలనే..

రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాన్ని నిన్నే పెళ్లాడుతా లాంటి క్లాసిక్ సినిమాగా మలుస్తారనే ఉద్దేశంతో కల్యాణ్ కృష్ణకు అప్పగిస్తే ఆ స్థాయిలో లేకపోవడంతో నొచ్చుకున్నారట. అంతేకాకుండా కొన్ని కీలక సన్నివేశాలను రీషూట్ చేయాలని దర్శకుడిని ఆదేశించారనేది తాజా సమాచారం.

ఎడిటింగ్‌పై స్వయంగా..

ఎడిటింగ్‌పై స్వయంగా..

నాగచైతన్యకు మంచి క్లాసికల్ హిట్ అందించాలనే లక్ష్యంతో ఈ సినిమాపై నాగ్ స్వయంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్ వద్ద ఈ చిత్రంపై కుస్తీ పడుతున్నారట. ఎడిటింగ్ విభాగం పనితీరును నాగ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తున్నది.

ఆలస్యానికి కారణమిదే..

ఆలస్యానికి కారణమిదే..

ఈ సినిమా తాను ఆశించిన మేరకు ప్రాజెక్ట్‌ను ఓ క్లాసిక్‌గా రూపొందించాలనే తాపత్రయంతో నాగ్ ఉన్నారనేది ఇంటర్నల్ న్యూస్. నాగ్ సంతృప్తి చెందిన తర్వాతనే రారండోయ్ వేడుక చూద్దాం రిలీజ్‌కు ముహూర్తం నిర్ణయించే అవకాశం ఉంది. అప్పటివరకు అక్కినేని అభిమానులు వేచిచూడాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్.

English summary
Actor Nagarjuna is upset over the delay in the shooting of his new project 'Rarandoy Veduka Chuddam.' Now, he is angry on director Kalyan Krishna. As per reports, Nagarjuna had huge expectations to make this movie like 'Ninne Pelladatha. But Kalyan has not meet Tollywood Manmadudu's huge expectetions. so he ordered for a re-shoot when he saw the final product.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu