»   » బాహుబలిగా పవన్ కల్యాణ్.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైట్.. ఫోటో వైరల్..

బాహుబలిగా పవన్ కల్యాణ్.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైట్.. ఫోటో వైరల్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రం ప్రకంపనలు సృష్టిస్తున్నది. హాలీవుడ్ సినిమాలకు కూడా ఈ చిత్రం పోటీగా నిలుస్తుండటం సినీ పండితులను నివ్వెరపాటుకు గురిచేస్తున్నది. రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసే చిత్రంగా ముందే ఊహించిన అంచనాలను సైతం సునాయసంగా దాటేందుకు సిద్దమవుతున్నది. ఈ చిత్రంలో నటించిన పత్రీ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఇక బాహుబలి పాత్రను ఎవరూ పోషించలేరంటూ ప్రశంసలు వ్యక్తం చేస్తుండగా తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన ఫొటో ఒకటి వైరల్‌గా మారింది.

పవన్ బాహుబలిగా..

పవన్ బాహుబలిగా..

బాహుబలి పాత్రకు మరే నటుడు సరిపోడు అంటున్న వ్యాఖ్యల నేపథ్యంలో బాహుబలి గెటప్‌లో పవన్ కల్యాణ్ ఫోటో సోషల్ మీడియాలో కనిపించడం హల్‌చల్ రేపింది. బాహుబలి గెటప్‌ ఫోటోను తీసుకొని మార్ఫింగ్‌కు పాల్పడ్డారు. బాహుబలి రూపంలో ఉన్న పవన్ కల్యాణ్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


పవన్ ఫ్యాన్స్ హంగామా..

పవన్ ఫ్యాన్స్ హంగామా..

అమరేంద్ర బాహుబలి గెటప్‌లో పవన్ అదిరిపోతున్నాడంటూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. బాహుబలికి మా హీరో ఏ మాత్రం తగ్గడని కామెంట్లతో మెగా ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు.


ప్రభాస్ ఫ్యాన్స్ ఎటాక్..

ప్రభాస్ ఫ్యాన్స్ ఎటాక్..

బాహుబలి ఫోటోను మార్పింగ్ చేసి సంతోషపడటం సరికాదు అనే ప్రభాస్ ఫ్యాన్స్‌తోపాటు మెగా వ్యతిరేక కూటమి నెగిటివ్ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. బాహుబలి అంటే ప్రభాస్ మాత్రమేనని, వేరే హీరోను ఊహించుకోవడం సరికాదు అనే వాదనను వినిపిస్తున్నారు.


వైరల్‌గా చర్చ..

వైరల్‌గా చర్చ..

బాహుబలి ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది. ఈ ఫోటోను ఎవరు పోస్ట్ చేశారు లాంటి ప్రశ్నలను పక్కన పెడితే ప్రస్తుతం ఈ గెటప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాహుబలి గెటప్‌లో పవన్ కల్యాణ్ బాగున్నాడంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే భవిష్యత్‌లో ఇలాంటి పాత్రలు పవన్ పోషిస్తారా అనే ప్రశ్నకు సమాధానం కష్టమే అయినప్పటికీ.. ఒకవేళ చేస్తే అభిమానులకు పండుగే పండుగ.English summary
Baahubali2 is now trend setter in world cinema. Prabhas as Baahubali becomes craze in everywhere. But Pawan Kalyan as Baahubali become viral in social media. This act leads to social media war between mega fans, and Prabhas fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu