నమ్రత గురించి నాకు బాగా తెలుసు.. తాజా ఆరోపణలపై స్పందించిన బండ్ల గణేష్
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వివాదం కొంత మంది సినీ తారలకు చెమటలు పట్టిస్తున్నట్లు అర్ధమవుతోంది. డ్రగ్స్ వాడకం ఆ ఇండస్ట్రీలో ఏళ్ల తరబడి ఉన్నట్లు అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇక సుశాంత్ మరణం తరువాత ఒక చిన్న ఆధారంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అసలు గుట్టును లాగుతున్నారు. ఇప్పటికే పలువురి స్టార్స్ పేర్లు బయటకు వచ్చాయి. ఇక నమ్రత పేరు ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో ఆరోపణలు వస్తున్న తరుణంలో బండ్ల గణేష్ స్పందించాడు.

వాట్సాప్ ఛాట్ లీక్ అవ్వడంతో..
ఎన్సీబీ అధికారులు త్వరలోనే బాలీవుడ్ లో బడా స్టార్స్ ని కూడా విచారించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మీడియాలో అందుకు సంబంధించిన వార్తలు కూడా చాలానే వైరల్ అవుతున్నాయి. దీపిక పదుకోన్ వాట్సాప్ ఛాట్ లీక్ అవ్వడంతో డ్రగ్ కేసులో ఆమె మేనేజర్ కరిష్మాకు నోటీసులు కూడా అందాయి. మరికొన్ని రోజుల్లో అసలు రహస్యాలు బయటపడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

నమ్రతపై ఆరోపణలు..
లీకులు మొదలైన నేపథ్యంలో బాలీవుడ్ మీడియా మరో అడుగు ముందుకు వేసి టాలీవుడ్ స్టార్స్ పేర్లు కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా వాట్సాప్ లో ఒక కోడ్ లో నమ్రత శిరోద్కర్ పేరు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. నింజా నిజాలు తెలుసుకోకముందే నమ్రత పేరును వార్తల్లోకి లాగడం వివాదాస్పదంగా మారింది.

ఆమె గురించి నాకు తెలుసు.. బండ్ల గణేష్
నమ్రత శిరోద్కర్ కి ఇప్పటికే అభిమానుల నుంచి భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది. ఇక మెల్లగా సినీతారలు కూడా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు బండ్ల గణేష్ కూడా తనదైన శైలిలో మద్దతు ఇచ్చాడు. నాకు ఆమె గురించి 15 ఏళ్లుగా తెలుసు. ఆమె చాలా మంది మహిళలకు ఒక స్ఫూర్తిని ఇచ్చారు. నమ్రత గారు ఒక గొప్ప భార్య, అలాగే మంచి తల్లి అని చెప్పగలను. ఆమె అంటే నాకు చాలా గౌరవం.. అని బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు.
Recommended Video

బండ్ల గణేష్ ట్వీట్ వైరల్
నమ్రతకు మద్దతు ఇవ్వడంతో పాటు ఆమె వ్యక్తిత్వం గురించి కూడా గొప్పగా చెప్పిన బండ్లగణేష్ ఒక ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. అందుకు సంబంధించిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఘట్టమనేని అభిమానులు కూడా బండ్ల గణేష్ ట్వీట్ పై పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక బాలీవుడ్ మీడియా ఆరోపణలపై మహేష్ ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











