»   » జూ ఎన్టీఆర్ ఫ్రెండ్ భూమి కబ్జా చేసారు

జూ ఎన్టీఆర్ ఫ్రెండ్ భూమి కబ్జా చేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రాణ స్నేహితుల్లో ఒకరైన రాజీవ్ కనకాల హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. కొందరు అక్రమార్కులు వారి కుటుంబానికి చెందిన భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతుండటంతో ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Actor Rajiv kanakala files complaint in Hayath Nagar Police station

కబ్జాకు గురైన స్థలం రాజవ్ కనకాల తండ్రి దేవదాసు కనకాల పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఈ స్థలంలో గత ఆర్థరాత్రి దుండగులు ప్రవేశించి... అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ విషయాన్ని స్థానికులు వెంటనే దేవదాసు కనకాలకు సమాచారం అందించారు.

అక్కడికి వెళ్లగా కబ్జా దారులు రాజీవ్ కనకాల, దేవదాసు కనకాలతో గొడవకు దిగారు. దీంతో వెంటనే వారు హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన బట్టి హైదరాబాద్ లో కబ్జాదారుల ఆగడాలు ఏ రేంజిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సెలబ్రిటీల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యులు పరిస్థితి ఏమిటని సమాన్యులు ప్రశ్నిస్తున్నారు.

English summary
Veteran Actor Devadas kanakala and his son Rajiv kanakala has approached the Hayathnagar Police station and complained about the land enchroachment. As per the sources, Devadas kanakala own a land in Hayathnagar premises of Rangareddy district.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu