»   » చలపతిరావు వివాదం: రామ్ సింపతి, ‘మా’ వార్నింగ్...

చలపతిరావు వివాదం: రామ్ సింపతి, ‘మా’ వార్నింగ్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో మహిళలను కించ పరుస్తూ సీనియర్ నటుడు చలపతిరావు చేసిన కామెంట్ పెద్ద దుమారం రేగిన నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) స్పందించింది.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రతినిధి నరేష్ మాట్లాడుతూ... చలపతిరావు అమ్మాయిల‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, వాటిపై రేగిన దుమారం తామందరికీ ఓ గుణ‌పాఠ‌మ‌ని ఆయ‌న అన్నారు.

చాలా ఆడియో వేడుకల్లో అలానే

చాలా ఆడియో వేడుకల్లో అలానే

ఈ మధ్య చాలా ఆడియో ఫంక్ష‌న్స్ లో కొంతమంది నటులు హాస్యానికి, అవసరం లేని వ్యాఖ్యలకు మధ్య ఉండే చిన్న తేడాను గుర్తించ‌డంలేద‌ని, న‌టులు ఏదో ఉత్సాహంలో ఒక వ్యాఖ్య చేయ‌డం ఆ మాట సామాజిక మాధ్య‌మాల ద్వారా వైర‌ల్ కావ‌డం వంటివి కొన్నేళ్లుగా జ‌రుగుతున్నాయ‌ని అన్నారు. ఏదైనా మాట్లాడేప్పుడు ఆచితూచి మాట్లాడాలన్నారు.

ఖండన

ఖండన

చలపతిరావు కామెంట్ష్ మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ నుంచి ఖండిస్తున్నామని ‘మా' అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. చలపతిరావు కూడా తమతో మాట్లాడారని, చాలా బాధపడ్డారని చెప్పారు. చలపతిరావుకు ఇండస్ట్రీలో మంచి పేరు ఉందని, మంచి.. మంచి విషయాలు చెప్పేవారు తప్పా, ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదని శివాజీ రాజా అన్నారు.

మరోసారి జరిగితే మెంబర్ షిప్ తొలగిస్తామని వార్నింగ్

మరోసారి జరిగితే మెంబర్ షిప్ తొలగిస్తామని వార్నింగ్

ఆడియో ఫంక్షన్‌లో చేసిన వ్యాఖ్యలకు చలపతిరావు క్షమాపణలు చెప్పారని, తాము కూడా ‘మా' తరుఫున క్షమాపణలు చెబుతున్నామని, ఇంకొకసారి ఆర్టిస్టుల తరఫు నుంచి ఇలాంటి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు రావని, ఒకవేల వస్తే ఆసోషియేషన్ సీరియస్‌గా పరిగణిస్తుందని, నంబర్ షిప్ కూడా తొలగించడం జరుగుతుందన్నారు.

ఈ సారి చలపతిని క్షమించి వదిలేయండి

ఈ సారి చలపతిని క్షమించి వదిలేయండి

ఈసారికి చలపతిరావును క్షమించాలని, ఇంతటితో వదిలేయాలని, కేసులు విత్‌డ్రా చేసుకోవాలని శివాజీరాజా మహిళా సంఘాలకు మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ తరఫున విజ్ఞప్తి చేశారు.

రామ్ సింపతీ

చలపతిరావు వ్యవహారంపై హీరో రామ్ స్పందించారు. ఈ వ్యవహారంపై సింపతీ తెలుపుతూ ట్వీట్ చేసారు.

English summary
The recent comments made by Chalapati Rao on women have become a talking point all over. Several celebrities have raised objections to this issue and the first among the young heroes, Ram has responded to it. In a detail twitter message Ram condemned Chalapati Rao’s words and said that such a senior actor should think twice while making such statements.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu