»   » ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణం సినీ పరిశ్రమే.. అంతా స్వార్ధపరులే.. శివాజీరాజా

ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణం సినీ పరిశ్రమే.. అంతా స్వార్ధపరులే.. శివాజీరాజా

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిత్రం, మనసంతా నువ్వే చిత్రాలతో ఫ్యామిలీ ఆడియెన్స్, కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ మరణించి దాదాపు మూడేండ్లు కావోస్తున్నా అతని మరణ విషాదం ప్రతీ ఒక్కరిని వెంటాడుతూనే ఉంటుంది. సందర్భం ఏదైనా వస్తే ఉదయ్ కిరణ్‌ను తలుచుకొని బాధపడని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. తాజాగా ఉదయ్ కిరణ్ మృతి గురించి ఓ కార్యక్రమంలో మా అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ రాజా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

ఉదయ్ కిరణ్ స్మారక షార్ట్ ఫిలిం అవార్డులు

ఉదయ్ కిరణ్ స్మారక షార్ట్ ఫిలిం అవార్డులు

ఉదయ్ కిరణ్ జన్మదినం పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో షార్ట్ ఫిలిం పోటీలకు సంబంధించిన విజేతలకు పురస్కరాలు అందించారు. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ కిరణ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. విజేతలకు బహుమతులను అందించి వారి ప్రతిభను ప్రశంసించారు.

లేకపోవడం దురదృష్ణకరం

లేకపోవడం దురదృష్ణకరం

ఈ సందర్భంగా శివాజీ రాజా మాట్లాడుతూ.. ఉదయ్ కిరణ్ ప్రతిభావంతుడైన నటుడు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కింది స్థాయి నుంచి విశేష కృషితో పైకి వచ్చాడు. అలాంటి నటుడు అర్ధాంతరంగా జీవితం చాలించడం చాలా దురదృష్టకరం. ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణం సినీ పరిశ్రమయే. బాధలో ఉన్నవారిని ఎవరూ పట్టించుకోరు అని శివాజీ రాజా వ్యాఖ్యానించారు.

సినీ పరిశ్రమ ఆదుకొంటే..

సినీ పరిశ్రమ ఆదుకొంటే..

కష్టాల్లో ఉన్న ఉదయ్‌ను సినీ పరిశ్రమ ఆదుకొని ఉంటే ఈ రోజు మన మధ్య ఉండేవాడు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సిన దుస్థితి రాకపోయి ఉండేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. సినిమా పరిశ్రమలో చాలా మంది స్వార్ధపరులు ఉన్నారు. ఇక్కడ ఎవరి స్వార్థం వారిదే.. పక్కవాడిని పట్టించుకోవడం ఉండదు అని అన్నారు. ఉదయ్ కిరణ్ గురించి తలచుకొని ఉద్వేగానికి గురయ్యాడు.

నాకు మంచి మిత్రుడు. .

నాకు మంచి మిత్రుడు. .

ఉదయ్ కిరణ్ స్మారకంగా ప్రతీ ఏటా షార్ట్ ఫిలిం పోటీలను నిర్వహిస్తున్నారు. గత రెండు మూడు ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమాన్ని ఉదయ్ కిరణ్ జన్మదినం రోజున చేపట్టారు. ఉదయ్ కిరణ్ పేరు నిర్వహించే కార్యక్రమానికి రావడం గర్వంగా ఉంది. మా సభ్యుడు అంతకంటే నాకు మంచి మిత్రుడు. నాకే కాదు శ్రీకాంత్, తరుణ్‌కు చాలా మందికి సన్నిహితుడు అని శివాజీ రాజా అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా నిర్వహించడం చూస్తుంటే ఉదయ్ కిరణ్ బతికి ఉన్నాడనే అనిపిస్తున్నది అని అన్నారు.

English summary
Actor Shivaji Raja sensational comments on Film Industry. he made allegations not support Uday Kiran when he was in trouble. Shivaji Raja made this comments in Uday Kiran Short film contest.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu