»   » పవన్ సినిమాలో విలన్ కన్‌ఫర్మ్.. రెండు ఫ్లాపుల తర్వాత కూడా..

పవన్ సినిమాలో విలన్ కన్‌ఫర్మ్.. రెండు ఫ్లాపుల తర్వాత కూడా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందున్న చిత్రంలో విలన్ పాత్ర ఎంపిక పూర్తయిందట. ఈ చిత్రంలో విలన్‌గా సోను సూద్‌ను ఖారారు చేసినట్టు సమాచారం. గతంలో త్రివిక్రమం రూపొందించిన అతడు, జులాయి చిత్రంలో సోను సూద్ విలన్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. పవన్ కెరీర్‌లో 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విలన్‌ది పవర్ ఫుల్ పాత్ర అట. పలువురి పేర్లను పరిశీలించిన పిదప సోనుసూద్‌ను ఖరారు చేసినట్టు తెలిసింది.

ఇటీవల సోనుసూద్ బాలీవుడ్ చిత్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల తెలుగు చిత్రాల్లో ఆయన కనిపించిన సినిమాలు తక్కువే. మహేశ్‌బాబుతో సోను నటించిన ఆగడు, ప్రభుదేవా చిత్రం అభినేత్రి బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత తెలుగు చిత్రాలకు దూరమయ్యాడు. తాజాగా త్రివిక్రమ్‌ చిత్రంలో సోను సూద్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారనే లేటేస్ట్ న్యూస్.

Actor Sonu Sood is playing as villain in Pawan Kalyan's movie

ఇంకా పేరు పెట్టని పవన్ కల్యాణ్ తాజా చిత్రంలో కీర్తీ సురేశ్, అను ఇమ్మాన్యుయేల్, కుష్భూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో షూటింగ్ వేగవంతంగా జరుగుతున్నది. ఈ చిత్రం సెప్టెంబర్ మూడో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

English summary
Actor Sonu Sood is playing as villain in Pawan Kalyan's movie. Pawan's 25th movie of his career, is under direction of Trivikram Srinivas. Keerthy Suresh, Anu Emmanuel and Khushbu in other key roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu