twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రేకింగ్: Vijay Deverakonda ఈడీ విచారణకు హాజరైన రౌడీస్టార్.. లైగర్‌ అక్రమ పెట్టుబడుల కేసులో సంచలనం

    |

    లైగర్ సినిమాకు సంబంధించిన అక్రమ పెట్టుబడుల వ్యవహారంలో ఎన్‌‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఇప్పటికే నిర్మాత ఛార్మీ కౌర్, దర్శకుడు పూరీ జగన్నాథ్‌తోపాటుపలువురిని విచారించిన ఈడీ అధికారులు తాజాగా రౌడీస్టార్ విజయ్ దేవరకొండను విచారించేందుకు సిద్దమైంది. కొద్ది రోజుల క్రితం నోటీసులు జారీ చేయడంతో విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యేందుకు సంబంధిత కార్యాలయానికి వెళ్లారు. ఈడీ విచారణకు సంబంధించిన వ్యవహారంలోకి వెళితే..

    లైగర్‌కు రాజకీయ నేత పెట్టుబడి

    లైగర్‌కు రాజకీయ నేత పెట్టుబడి

    లైగర్ సినిమాకు రాజకీయ నేతల నుంచి భారీగా అక్రమంగా పెట్టుబడులు వచ్చాయని కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్ ఫిర్యాదు చేశారు. పలు దర్యాప్తు సంస్థలకు జడ్సన్ కొన్ని పత్రాలను సమర్పించారు. లైగర్‌కు తెలంగాణలోని ఓ ప్రముఖ నేత పెట్టుబడి పెట్టి ఆధారాలను అందించారు అనే ఫిర్యాదు ఈడీ అధికారులు చేరింది. ఈ క్రమంలోనే ఈడీ పలువురిని విచారించింది.

    కాంగ్రెస్ నేత ఫిర్యాదు

    కాంగ్రెస్ నేత ఫిర్యాదు

    లైగర్ సినిమా కోసం తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ ఫ్యామిలీకి చెందిన నేత అక్రమంగా పెట్టుబడి పెట్టారు. నల్లధనాన్ని వైట్ మనీగా మార్చే ప్రక్రియలో భాగంగా లైగర్ సినిమాకు ఫైనాన్స్ చేశారు. ఈ సినిమా నిర్మాణానికి అక్రమంగా డబ్బు తరలించారు. కేవలం లైగర్ సినిమా కోసమే కాకుండా జనగణమన సినిమా కోసం కూడా రాష్ట్రంలోని రాజకీయ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు పెట్టుబడులు పెట్టారు అని కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్ ఈడీ, సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు.

    నవంబర్ 17వ తేదీన పూరీ, చార్మీ

    నవంబర్ 17వ తేదీన పూరీ, చార్మీ

    లైగర్ నిర్మాణంలో అక్రమ పెట్టుబడులు ఉన్నాయనే ఆరోపణలు, ఫిర్యాదు రావడంతో దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత, పూరీ కనెక్ట్ సహభాగస్వామి చార్మీ కౌర్‌ను నవంబర్ 17వ తేదీ (గురువారం) హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లోనీ ఈడీ కార్యాలయంలో విచారించారు. దాదాపు 8 గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించడం తెలిసిందే. ఈ విచారణ తర్వాత పూరీ, చార్మీ మీడియాతో మాట్లాడుకుండానే వెళ్లిపోయారు.

    విజయ్ దేవరకొండకు నోటీసులు

    విజయ్ దేవరకొండకు నోటీసులు

    అయితే లైగర్ అక్రమ పెట్టుబడులు వ్యవహారంలో దర్యాప్తు ముగిసిందని అనుకొంటున్న సమయంలో లైగర్ హీరో విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 30వ తేదీ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. దాంతో విజయ్ దేవరకొండ బషీర్ బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకొన్నారు. పలు అంశాలపై విజయ్ దేవరకొండను ప్రశ్నించే అవకాశం ఉంది.

    టాలీవుడ్‌పై ఈడీ దూకుడు

    టాలీవుడ్‌పై ఈడీ దూకుడు

    అయితే విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరు కావడం టాలీవుడ్ వర్గాల్లోను, మీడియాలోను భారీగా చర్చ జరుగుతున్నది. ఇటీవల కాలంలో డ్రగ్స్, అక్రమ పెట్టుబడుల వ్యవహారంలో సినీ ప్రముఖుల పేర్లు రావడంతో సినీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమైంది. అయితే లైగర్ అక్రమ పెట్టుబడుల వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో వేచి చూడాల్సిదే.

    English summary
    Actor Vijay Deverakonda attends for ED questioning over Liger investment. Earlier, Telugu Film Actor Charmee Kaur, director Puri Jagannadh questioned by ED in Hyderabad. Reports suggest that, Popular politician invested their money into Liger production.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X