»   » హత్నాయత్నం కేసులో నటుడు వినోద్ కుమార్ అరెస్ట్

హత్నాయత్నం కేసులో నటుడు వినోద్ కుమార్ అరెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు వినోద్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేసారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి వ్యక్తిగత మేనేజర్‌పై హత్యాయత్నం చేసినట్లు ఫిర్యాదు అందడంతో వినోద్ కుమార్‌ను కర్ణాటక పోలీసులు అరెస్టు చేసి పూత్తూరు కోర్టులో ప్రవేశ పెట్టగా కోర్టు అతనికి 14 రోజుల జుడీషియల్ కస్టడీకి తరలించారు.

నటుడు వినోద్ కుమార్‌కు వ్యక్తిగత మేనేజర్‌గా సచ్చిదానంద గత కొన్నేళ్లుగా పని చేస్తున్నారు. వినోద్ కుమార్‌కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో గోల్‌మాల్ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వినోద్ కుమార్.. మేనేజర్ సచ్చిదానంద ను చంపడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి. 

 Actor Vinod Kumar Arrested

సచ్చినదానంద ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. సచ్చిదానంద పుత్తూరు పరిధిలోని సంప్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వినోద్ కుమార్ స్వగ్రామమైన దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకా ఈశ్వర మంగలలో నటుడిని అరెస్ట్ చేసి తరలించారు.

వినోద్ కుమార్ వివరణ

తాను ఎవరి మీద హత్యాయత్నం చేయలేదని, తన పేరు రెడగొట్టడానికి, డబ్బులు గుంజడానికే ఈ కేసు పెట్టారని వినోద్ కుమార్ కోర్టు ఆవరణలో మీడియాకు తెలిపారు.

English summary
Popular actor Vinod Kumar has been arrested by Karnataka police for attempting murder on his personal manager. Sachidhananda has been working as a personal manager of Vinod Kumar since long time.
Please Wait while comments are loading...