»   » కాళ్ళూ చేతులూ నరుకుతాం: హీరోని ఇంతగా బెదిరిస్తున్నారా???

కాళ్ళూ చేతులూ నరుకుతాం: హీరోని ఇంతగా బెదిరిస్తున్నారా???

Posted By:
Subscribe to Filmibeat Telugu

కోలీవుడ్ నటుడు, నడిగర సంఘం ప్రధాన కార్యదర్శి, తమిళ నిర్మాతల సంక్షేమ సంఘం అధ్యక్షుడు విశాల్ కు తీవ్రస్థాయిలో బెదిరింపులు వస్తున్నాయట. నడిగర్ సంఘంలో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన విశాల్ కి ఇప్పుడు చాలామందే శతృవులు తయారయ్యారు. గతం లో కూడా చంపేస్తాం అంటూ బెదిరింపులు ఎదుర్కున్నాడు. కానీ ఎప్పుడూ ఆ భయన్ని బయట పెట్టాదు.

ఎప్పుడూ తన పనేదో తను చూసుకునే రకం కాదు విశాల్ ఎప్పుడూ పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునే విశాల్...ఈ మధ్యే కర్ణాటక వెళ్లి, అక్కడ మాట్లాడేందుకు సాహసించని కావేరీ వివాదంపై నిర్భయంగా మాట్లాడాడు. సినీ నటి వరలక్ష్మితో ప్రేమలో ఉన్నాడంటూ పలు మార్లు వార్తలు రాగా, తామిద్దరం మంచి స్నేహితులమని వారు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Actor Vishal gets a life threatening calls
Chiranjeevi 151 Movie Title Changed

ఇన్ని వివాదాల లో ఉండే విశాల్ కి ఈ మధ్యకాలంలో బెదిరింపులు కాల్స్ వస్తున్నాయి. అది కూడా మామూలుగా కాదు సీరియస్ గానే ఉంటున్నాయట. శ్రుతి మించి కాళ్లు, చేతులు నరికేస్తామంటూ బెదిరింపులు రావడంతో విశాల్ అప్రమత్తమయ్యాడు. దీంతో, నిర్మాతలు మణిమ్మరన్‌, మహమ్మద్‌ సాహిల్‌ చెన్నై సీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

English summary
Actor Vishal receives abusive phone calls, lodges police complaint
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu