For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎమ్మెల్యే కంటే ఎక్కువ సంపాదిస్తా.. వాళ్లను తొక్కిపారేస్తా.. పొలిటికల్ ఎంట్రీపై విశాల్ (ఇంటర్వ్యూ)

  By Rajababu
  |

  పందెంకోడితో మొదలైన హీరో విశాల్ విజయ జైత్రయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. వరుస సక్సెస్‌లతో విశాల్ దూసుకెళ్తున్నాడు. తాజాగా తమిళంలో విశాల్ నటించిన తుప్పరివాలన్ చిత్రం ఘన విజయం సాధించింది. తుప్పరివాలన్ చిత్రం ప్రస్తుతం తెలుగులో డిటెక్టివ్ అనే పేరుతో డబ్బింగ్ చిత్రంగా నవంబర్ 10న విడుదలకు సిద్ధం అవుతున్నది. ఈ నేపథ్యంలో ఆదివారం తెలుగు ఫిల్మీ బీట్‌తో జీఎస్టీ, సెన్సార్ ఆంక్షలు, పైరసీ తదితర అంశాలపై మాట్లాడారు. విశాల్ చెప్పిన పలు విషయాలు ఆయన మాటల్లోనే..

  Vishal's "Detective" Releases On November 10 విశాల్‌కు షాకిచ్చిన బ్యాంకర్లు
   సెన్సార్ అతిపెద్ద సమస్య

  సెన్సార్ అతిపెద్ద సమస్య

  తెలుగు, తమిళంలో ఓకేసారి విడుదల చేయలేకపోవడానికి కారణం సెన్సార్ బోర్డు. ఈ సినిమాకు సెన్సార్‌ చేయించడం ఇప్పుడ పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు తమిళ సినిమా సెన్సార్‌ను ముంబైకి మార్చారు. ఈ రోజుల్లో సెన్సార్‌ సర్టిఫికేట్‌ను సాధించడమంటే డిగ్రీ సర్టిఫికేట్‌ను సాధించినంత పనైపోతున్నది. దీంతో పాటు తెలుగులో మన సినిమాను విడుదల చేయాలనుకునే సమయానికి పెద్ద హీరో సినిమా రిలీజ్‌కు ఉంటుంది. దాన్ని వల్ల థియేటర్స్‌ విషయంలో సమస్యలు వస్తాయి.

   అందుకే ఒకేసారి రిలీజ్ చేయలేదు

  అందుకే ఒకేసారి రిలీజ్ చేయలేదు

  ఒక మంచి సినిమా ప్రేక్షకులకు చేర్చడమే నా లక్ష్యం. అందుకు మంచి థియేటర్లు కావాలి. అందుకోసం వేచి చూడాల్సి వస్తుంది. అందుకే డిటెక్టివ్ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి కుదుర లేదు.

  సెన్సార్ సర్టిఫికేట్ మాత్రమే..

  సెన్సార్ సర్టిఫికేట్ మాత్రమే..

  'మెర్సల్‌'(అదిరింది) సినిమా విషయంలో ప్రభుత్వాల జోక్యం సరికాదు. ఓ సినిమాకు సెన్సార్‌ సెంట్రల్‌ బోర్డు అంగీకరించిన తర్వాత సమస్యలు ఉండకూడదు. మధ్యలో రాజకీయ పార్టీలు అన్నీ చేరి సినిమాలోని డైలాగ్స్‌ను కట్‌ చేసుకుంటూ వెళ్లమంటూ ఉంటే చివరకు సెన్సార్‌ సర్టిఫికేట్‌ను మాత్రమే చూపించాల్సి ఉంటుంది. సినిమా చూడటానికి ఏమీ మిగలదు.

   పైరసీపై విజయం సాధిస్తా

  పైరసీపై విజయం సాధిస్తా

  పైరసీ మీద చేసే పోరాటం నాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఈ విషయంలో ఒక అడుగు ముందుకేస్తే మరో అడుగు వెనుకకు పడుతున్నది. అయితే పైరసీపై ఏదో ఒకరోజు విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది. తమిళరాకర్ వెబ్‌సైట్‌ను నిలిపివేసినా ఫలితం కనిపించడం లేదు. పైరసీదారులను ఏదో ఒకరోజు తొక్కిపారేస్తాను

   అందుకే విలన్‌గా నటించాను

  అందుకే విలన్‌గా నటించాను

  సూపర్‌స్టార్ మోహన్ లాల్‌తో కలిసి విలన్ చిత్రంలో నటించాను. మలయాళంలో ఇదే తొలి చిత్రం. విలన్‌గా ఎందుకు నటించానంటే హీరోగా నటించాను. ఓ చిత్రంలో హీరోయిన్‌ పాత్రను పోషించా. మిగిలింది విలన్ పాత్ర. ఆ పాత్ర నా వద్దకు వచ్చింది. అంతేకాకుండా నాకు నెగటివ్‌ రోల్‌ చేయాలని చాలా రోజులుగా మనసులో కోరిక ఉంది. మోహన్‌లాల్‌గారి 'విలన్‌' సినిమాతో తీరిపోయింది.

   అరచేతిలో గుండె పట్టుకొని

  అరచేతిలో గుండె పట్టుకొని

  మోహన్ లాల్ కళ్లతోనే హావభావాలను వ్యక్తపరుస్తారు. అటువంటి గొప్ప నటుడితో నటించడం చాలా కష్టం. నా భయాన్ని భయట పెట్టకుండా నటించాను. ఆయన ముందు నటిస్తున్నంత సేపు నేను నా గుండెను అరచేతిలో పట్టుకొని నటించాను. ఆయన అంతటి ప్రతిభావంతుడైన నటుడు అని విశాల్ చెప్పారు.

   తెలుగులో స్ట్రెయిట్ సినిమా

  తెలుగులో స్ట్రెయిట్ సినిమా

  విలన్‌ సినిమాలో ఆక్రోషంతో కూడిన పాత్రలో కనపడతాను. ఈ సినిమా తమిళం, తెలుగులో డిసెంబర్‌లో విడుదలవుతుందని తెలిపారు. మంచి కథ లభిస్తే తెలుగు స్ట్రయిట్‌ సినిమా చేయాలని ఉంది. అలాంటి అవకాశం వస్తే తప్పకుండా తెలుగులో స్ట్రయిట్‌ సినిమా చేస్తాను.

  జీఎస్టీ ప్రభావం ఎక్కువగా ఉంది

  జీఎస్టీ ప్రభావం ఎక్కువగా ఉంది

  సినిమాలపై జీఎస్టీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. దాని వల్ల చాలా సినిమాలు ఇబ్బందుల్లో పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నాం. ఈ సమస్య తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ మధ్యలో హోటల్‌ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులంతా సెంట్రల్‌ గవర్నమెంట్‌ను కలిసి రెప్రజెంట్‌ చేస్తే జీఎస్టీని 12 శాతానికి తగ్గించారు. అలాంటి రెప్రజెంటేషన్‌ను మేం కూడా కలిసి చేయాలనుకుంటున్నాం అని అన్నారు.

  పాలిటిక్స్‌పై ఆసక్తి లేదు

  పాలిటిక్స్‌పై ఆసక్తి లేదు

  తమిళనాడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రజనీకాంత్, కమల్ హాసన్ రావడంపై స్పందిస్తూ.. వారు అధికారికంగా ప్రకటించిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. నాకు ఇప్పట్లో పాలిటిక్స్‌లోకి వచ్చే ఆలోచన లేదు. ప్రస్తుతం మంచి సినిమాలు వస్తున్నాయి. డబ్బులు కూడా బాగానే సంపాదిస్తున్నాను. అలాంటప్పుడు కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకు అని విశాల్ అన్నారు.

   ఎమ్మెల్యే కంటే నేను సంపాదించేది ఎక్కువ

  ఎమ్మెల్యే కంటే నేను సంపాదించేది ఎక్కువ

  మహా అంటే ప్రస్తుతం ఎమ్మెల్యే జీతం రెండు లక్షలుంటుంది అనుకుంటా. సినిమాల ద్వారా నేను సంపాదించేది చాలా ఎక్కువ. ఆ జీతాన్ని దాంతో పోల్చుకుంటే చాలా తక్కువ. అధికారం ఉంటేనే ప్రజలకు మేలు చేయవచ్చునని అనిపించిన రోజున తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాను అని విశాల్ అన్నారు.

  English summary
  Vishal's latest movie is thupparivaalan in Tamil. That movie coming into telugu as Detective. So in that occassion, Vishal speaks to Telugu Filmibeat.com on several Issues. He said he has no political motive right now. He said if politics are right way to serve for people. then I will think to entry to politcs.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X